భర్త వేధింపులు తట్టుకోలేక సాగర్ కెనాల్ కాల్వలో పడేసి హత్య చేసిన భార్య..

ఆలస్యంగా మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో అన్ని కోణాల్లో విచారణ… దర్యాప్తులో నిందుతులను పసిగట్టి చుట్టూ పక్కన జిల్లాలో నిఘా పెట్టిన పోలీసులు.అరెస్ట్ చేస్తారనే భయంతో తప్పించుకొని తిరుగుతూ.

 Unable To Bear The Harassment Of Her Husband, The Wife Threw Herself Into The Ca-TeluguStop.com

శనివారం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన ఐదుగురు నిందుతులు.రిమాండ్ కు తరలించినఖమ్మం ఆర్బన్ పోలీసులు… కేసు వివరాలను వెల్లడించిన ఖమ్మం టౌన్ ఏసీపీ అంజనేయులు…ఖమ్మం యుపిహెచ్ కాలనీలో నివాసముంటున్న ఎస్కే అన్వర్ అనే వ్యక్తి గత కాలంగా కనిపించడం లేదని అతని తల్లి ఎస్ కె రహమత్ ఈ ఏడాది జులై నెలలో ఖమ్మం ఆర్బన్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసును నమోదు చేసిన ఖమ్మం ఆర్బన్ పోలీసులు సిఐ రామకృష్ణ ఆద్వర్యంలో అన్వర్ ఆచూకీ కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారని ఏసీపీ అంజనేయులు తెలిపారు.

కేసు విచారణలో భాగంగా అనుమానితులైన భార్య సల్మా, అత్త సాధుఖాన్ మరియు బాలాజీ పై నిఘా పెట్టి వారి కదలికలను పసిగడుతుండగాభార్య సల్మా స్థిర నివాసమైన మహబూబాబాద్ లో ఉంటున్నారని తెలిసి అక్కడి పోలీసు వారి సహాయంతో వారిని పట్టుకోవడం కోసం తిరిగిన ఫలితం లేదు.తర్వాత ఐడి పార్టీ పోలీసుల ద్వారా నిఘాపెంచారు.

ఈ క్రమంలో పోలీసులు ఎలాగైనా పట్టుకుంటారని భయపడిన బందువులు సైతం వారికి ఆశ్రమం ఇవ్వ లేదని తెలిపారు.గాలిస్తున్న పోలీసుల నుండి తప్పించుకునే పరిస్థితి లేదని గ్రహించి ఖమ్మం నగరంలో వారికి తెలిసిన పెద్దమనుషుల సహకారంతో శనివారం పోలీస్ స్టేషన్ కు వచ్చిన నిందుతులు అన్వర్ భార్య సల్మా, అత్త సాదుఖాన్, బావమరిది యాకూబ్ మరియు బాలాజీ, వీరన్న ను విచారించగా అన్వర్ ను మేమే హత్య చేశామని వాస్తవ విషయాలు వెల్లడించారని ఏసీపీ తెలిపారు.

అన్వర్ వివాహం అయిన దగ్గర్నుండి చికెన్ దుకాణంలో పనిచేస్తు ఉంటాడని మద్యనికి బానిస కావడంతో పాటు గంజాయి అలవాటు పడి భార్యను అనుమానిస్తాడని, భార్య వారిఇద్దరు ఆడపిల్లలను పట్టించుకోకుండా, అప్పుడప్పుడు ఇంట్లో నుండి రెండు మూడు నెలలు వెళ్లి తిరిగి తనంతట తానుగా ఇంటికి వచ్చేవాడని,భార్యను చిత్రహింసలకు గురి చేసి కొట్టేవాడని, ఎన్నిసార్లు చెప్పినా కూడా తన ప్రవర్తన మార్చురాలేదని.అన్వర్ తన భార్య సల్మాను ఇంట్లో గ్యాస్ లీక్ చేసి చంపాలని ప్రయత్నం కూడా చేశాడని నిందుతురాలు వెల్లడించారని తెలిపారు.

మృతుడు అన్వర్ మామ చనిపోగా అన్వార్ అత్త సాధకున్ ఖమ్మంలో తన కూతురు సల్మా, ఇద్దరు పిల్లలతో ఉంటూ సుతారి పనులకు వెళ్తున్న క్రమంలో చింతకాని మండలం, అనంతసాగర్ కు చెందిన బాలాజీ పరిచయమై గత15సంవత్సరాల నుండి అన్వర్ అత్తతో బాలాజీ అక్రమ సంబంధం పెట్టుకొని ఇద్దరు కలిసి సుతారి పనులకు వెళుతుండేవారని తెలిపారు.బాలాజీ తన అత్త వెంట వెళ్తున్నాడని అన్వర్ కు నచ్చకపోయేది.

ఎన్నిసార్లు చెప్పినా కూడా బాలాజీ అలాగే వస్తున్నాడని బాలాజీ మీద కోపం పెంచుకున్నాడు గత సంవత్సరం uph కాలనీలో సెప్టెంబర్ 26 న తారీఖున బాలాజీ బండిని అన్వర్ తగలపెట్టాడు.బాలాజీని కత్తితో దాడి చేసిన కేసు ఖమ్మం టూ టౌన్ లో గత సంవత్సరం నమోదు అయిందని తెలిపారు.

అన్వర్ ఆకృత్యాలను భరించలేక భార్య సల్మా మరియు అత్త కలిసి చంపాలని నిర్ణయించుకున్నారు.గత సంవత్సరం సెప్టెంబర్ 30 వ తేదిన రాత్రి సమయంలో యు పి హెచ్ కాలనీలో అన్వర్ చేతుల్ని చున్నీతో మరియు కాళ్ళను తాడుతో కట్టి అన్వర్ బావమరిది అయిన యాకూబ్ ఆటోలో బాలాజీ మరియు చిర్రా వెంకన్న అను ముగ్గురు ఆటోలో గోపాలపురం ఎస్ ఆర్ గార్డెన్ వెనుకాల సాగర్ కెనాల్ లో తీసుకువెళ్లి కాలువలలో పడేసి, చనిపోయి ఉంటాడని నిర్ధారించుకొని వెనుదిరిగారు.

ఆరోజు నుండి ఐదుగురు అన్వర్ హత్య గురించి బయటకు రాకుండా జాగ్రత్తపడి బయట ప్రాంతాలలో ఉంటున్నామని నేరం ఒప్పుకున్నారు.వారి నుండి ఒక ఆటో స్వాదినం చేసుకున్నామని తెలిపారు.

అన్వర్ భార్య సల్మా అత్త సాదుఖాన్ బామ్మర్ది యాకూబ్ బాలాజీ, చిర్రా వెంకన్నను గత రాత్రి అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా వారిని మెజిస్ట్రేట్ గారు రిమాండ్ కు తరలించారు.చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్లో గుర్తుతెలియని మృతదేహాల గురించి కాల్వ వెంట కొట్టుకు వచ్చిన శవాల గురించి ఆరా తీసిన ఫలితం కనిపించలేదని తెలిపారు.

అన్వర్ మృతదేహాం ఆచూకి తెలుసుకుంటామని ఏసీపీ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube