విచిత్రం: తల్లిదండ్రులు పెట్టిన పేరు నచ్చలేదని పోలీస్టేషన్ కి వెళ్లిన ఆకతాయి!

వినడానికి విచిత్రంగా వున్నా ఇది నిజమే.సాధారణంగా తల్లి దండ్రులు తమ చిన్నారులకు పేరు పెట్టేటప్పుడు వంద రకాలుగా, అన్నీ లెక్కలేసుకొని ఆలోచించి పెడతారు.

 A Boy Went To The Police Station Did Not Like The Name Given By His Parents Deta-TeluguStop.com

పేరు బాగుందని ఎవరన్నా బయటివారు చెబితే మురిసిపోతారు.కానీ అదే చిన్నారి పెరిగి పెద్దయిన తరువాత ‘నాకేంటి ఇలాంటి పేరు పెట్టారు… నాకు నచ్చలేదు’ అని చెబితే కాస్త నొచ్చుకుంటారు.

అంతవరకూ పర్వాలేదు.ఇలాంటివి చాలా ఇళ్లలో జరుగుతాయి.

అయితే అదే పిల్లాడు పేరు నచ్చలేదని సరాసరి పోలీస్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ చేస్తే ఎలా ఉంటుంది?

ఇక్కడ సరిగ్గా అలాగే జరిగింది.సంగారెడ్డి పోలీసులకు ఇలాంటి ఓ వింత అనుభవం ఎదురైంది.

వివరాల్లోకి వెళితే, సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ లో నివాసం ఉండే సురేష్ అనే కుర్రాడు డయల్ 100కు ఫోన్ చేసి, తన తల్లిదండ్రుల మీద కేసు పెట్టాలని పోలీసులకు రిపోర్ట్ చేసాడు.వారి రీజన్ ఏమిటని అడగగా… తనకు తన పేరు నచ్చలేదని, ఆ పేరు పెట్టినందుకు వాళ్ళ అమ్మ-నాన్నలను అరెస్ట్ చేయమని కోరాడు.

దాంతో ఆ పోలీసులు బిత్తరబోయారు.

Telugu Latest, Mother, Names, Sanga, Strange, Suresh-Latest News - Telugu

పోలీసులు కొంచెం తేరుకొని, సురేశ్ పేరు బాగుంది కదా.ఎందుకు నచ్చలేదని అడిగారు.దానికి అతడు చెప్పిన రీజన్ విని ఖంగు తిన్నారు.

విషయమేమంటే, తన తల్లిదండ్రులకు మాజీ MP సురేష్ షెట్కార్ అంటే ఇష్టమని, ఆ ఇష్టంతోనే తనకి ఆ పేరును పెట్టారని కుర్రాడు ఆరోపించాడు.అయితే.తనకు ఆ పేరు నచ్చదని.అందుకే పేరెంట్స్ మీద కేసు పెట్టాలని పోలీసుల్ని బతిమిలాడాడు.

దీంతో.అతగాడికి నచ్చ చెప్పిన పోలీసులు.

అలా తల్లిదండ్రుల మీద ఉత్తినే కేసులు పెట్టటం సాధ్యం కాదని, కౌన్సెలింగ్ ఇచ్చి మరీ ఇంటికి పంపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube