ఈ సింపుల్ చిట్కాలతో కళ్ళ‌ చుట్టూ నలుపుకు గుడ్ బై చెప్పేయండి!

డార్క్ సర్కిల్స్( Dark circles, ) లేదా కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు.మనం అత్యంత సర్వసాధారణంగా ఎదుర్కొనే సమస్యల్లో ఇది ఒకటి.

 Say Goodbye To Dark Circles Around The Eyes With These Simple Tips , Simple Ti-TeluguStop.com

కంటి నిండా నిద్ర లేకపోవడం అనేది చాలా మందిలో డార్క్ సర్కిల్స్ తలెత్తడానికి ప్రధాన కారణం.అందుకే నిద్రను పొరపాటున కూడా నిర్లక్ష్యం చేయకూడదు.

కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోవాలి.అలాగే ఒత్తిడికి దూరంగా ఉండాలి.

బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి.స్క్రీన్ టైమ్ ను తగ్గించాలి.

ఇక కళ్ళ జుట్టు నలుపును మాయం చేయడానికి కొన్ని ఇంటి చిట్కాలు చాలా అంటే చాలా అద్భుతంగా సహాయపడతాయి.అందులో కొన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ బంగాళదుంప జ్యూస్ ( Potato juice )వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ బాదం నూనె ( Almond oil )వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

బాదం నూనె కలిపిన బంగాళదుంప రసాన్ని కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా కడిగేయాలి.రోజుకు రెండుసార్లు ఈ విధంగా చేశారంటే కళ్ళ చుట్టూ ఉన్న నలుపుకు గుడ్ బై చెప్పేయొచ్చు.

Telugu Tips, Dark Circles, Darkcircles, Latest, Simple Tips, Skin Care, Skin Car

అలాగే డార్క్ సర్కిల్స్ సమస్యను దూరం చేయడానికి మరొక ఎఫెక్టివ్ రెమెడీ ఉంది.అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి పాలు, రెండు టేబుల్ స్పూన్లు కీర దోసకాయ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ ( Lemon juice )వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై కూల్ వాటర్ తో కళ్ళను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రోజుకు రెండు సార్లు ఈ విధంగా చేసిన కూడా కళ్ళ చుట్టూ ఏర్పడిన నలుపు మాయం అవుతుంది.

డార్క్ సర్కిల్స్ దూరం అవుతాయి.

Telugu Tips, Dark Circles, Darkcircles, Latest, Simple Tips, Skin Care, Skin Car

ఇక ఇవేమీ మేము చేయలేము అనుకునేవారు రోజు నైట్ నిద్రించే ముందు స్వచ్ఛమైన ఆవు నెయ్యిని తీసుకుని కళ్ళ చుట్టూ అప్లై చేసి కనీసం ఐదారు నిమిషాల పాటు మసాజ్ చేసుకోండి.ఉద‌యాన్నే గోరువెచ్చ‌ని నీటితో క‌ళ్ళ‌ను క్లీన్ చేసుకోండి.ఇలా చేసిన కూడా మంచి రిజల్ట్ ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube