వంటచేస్తూ ఏకంగా ప్రపంచ రికార్డు కొట్టేసిన మహిళ.. ప్రత్యేకత ఇదే!

ఇంతవరకు మీరు ఎన్నో వరల్డ్‌ రికార్డులను గురించి వినే వుంటారు.అయితే వీరిలో అరుదుగా కొంతమంది విభిన్నంగా ట్రై చేస్తూ వుంటారు.

 The Woman Who Broke The World Record While Cooking At The Same Time This Is Spec-TeluguStop.com

వాటన్నింటికంటే ఇంకాస్త విభిన్నంగా ఓ మహిళ వంటలతో రికార్డు కూడా కొట్టొచ్చని ఇపుడు నిరూపించింది.వివరాల్లోకెళ్తే.

నైజీరియాకి చెందిన చెఫ్‌ హిల్డా బాసి ( Chef Hilda Basi )నాన్‌స్టాప్‌గా వంటలు చేస్తూ ఏకంగా ప్రపంచ రికార్డును సృష్టించింది.ఆమె గత గురువారం నుంచి నాన్‌స్టాప్‌గా వంటలు చేస్తూ గతంలో భారతీయ చెఫ్‌ లతా టాండన్‌ పేరిట ఉన్న రికార్డును బ్రేక్‌ చేయడం విశేషం.

గతంలో లతా సుమారు 87 గంటల 45 నిమిషాల పాటు వంట చేసి రికార్డు సృష్టిస్తే.ఇపుడు హిల్డా ఏకంగా 100 గంటల పాటు నాన్‌స్టాప్‌గా వంటలు చేసి గత రికార్డుని బద్దలు కొట్టింది.ఇదిలా ఉండగా, గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు ( Guinness World Record )సదరు చెఫ్‌ హిల్డా బేక్‌ చేసిన రికార్డు గురించి తెలిసిందని, ఐతే ఆ రికార్డును అధికారికంగా ధృవీకరించే ముందు అన్నింటిని పరిగణలోకి తీసుకోవాల్సి ఉందని ట్వీట్‌ చేసింది.ఈ క్రమంలో సదరు నైజీరియన్‌ చెఫ్‌ హిల్డా మాట్లాడుతూ.

నైజీరియన్‌( Nigeria ) యువత ఎంతలా కష్టపడి పనిచేస్తారో ప్రపంచానికి తెలియజేప్పేందుకు ఇలా చేశానని చెప్ప్పుకు రావడం విశేషమే.సమాజానికి దూరంగా ఉంటున్న ఆఫ్రికన్‌ యువతులు దీన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని ముందుకు రావాలని కోరుకుంటున్నానని ఈ సందర్భంగా ఆమె చెప్పారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.మీరు ఏ పనిచేయాలనుకుంటున్నా, దాన్ని సీరియస్‌గా తీసుకుని అందరికంటే మెరుగ్గా చేయాలని ప్రయత్నించాలి అని నైజీరియన్‌ యువతకు ఆమె చక్కటి సందేశం ఇచ్చారు.అదేకాకుండా నైజీరియన్‌ వంటకాలు గురించి ప్రపంచమంతా చాటిచెప్పాలనే ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు చెప్పుకొచ్చారు.కాగా హిల్డా తన వంటకాల్లో సూప్‌ దగ్గర నుంచి పశ్చిమ ఆఫ్రికాలోని ప్రసిద్ధ వంటకాలన్ని తయారు చేసింది.

ప్రతి గంటకు ఐదు నిమిషాల చొప్పున విరామం తీసుకుంటూ.తన వ్యక్తిగత విషయాల కోసం 12 గంటల కొకసారి ఒక గంట చొప్పున తీసుకుని ఈ ప్రపంచ రికార్డు సృష్టించింది.

Woman Set To Break World Record For Longest Cooking Time

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube