మీ గుండె పదిలంగా ఉండాలంటే..ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
TeluguStop.com
నేటి ఆధునిక కాలంలో గుండె జబ్బులతో మరణిస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగి పోతోంది.
ఆహారపు అలవాట్లు, మారిన జీవన శైలి, చెడు అలవాట్లు ఇలా రకరకాల కారణాల వల్ల వృద్ధులే కాకుండా యువత సైతం గుండె జబ్బుల బారిన పడుతున్నారు.
అయితే నిజానికి కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీరే మీ గుండెను పదిలంగా కాపాడుకోవచ్చు.
మరి అసలు గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్న విషయాలు ఇప్పుడు చూద్దాం.
"""/" /
బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగే కొద్ది గుండెకు ముప్పు పెరుగుతుంది.కాబట్టి, ఎప్పుడు కూడా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకునేందుకు, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుకునేందుకు ప్రయత్నించాలి.
తద్వారా మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది.హార్ట్ హెల్త్‌ను మెరుగు పరచడంలో ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది.
అందువల్ల, రెగ్యులర్‌గా మీ శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్‌ను అందించాల్సిన బాధ్యత మీదే.అలాగే మీ గుండె పదిలంగా ఉండాలంటే మీ డైట్‌లో తృణ ధాన్యాలు తప్పనిసరిగా ఉండాల్సిందే.
గుండె ఆరోగ్యానికి ఉపయోగపడే విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఇలా ఎన్నో పోషక విలువలు తృణ ధాన్యాల ద్వారా పొందొచ్చు.