స్టార్ మాతో ముగిసిన బిగ్ బాస్ అగ్రిమెంట్... ఇకపై వేరే ఛానల్ లో ప్రసారం?

విదేశాలలో బిగ్ బ్రదర్ అనే పేరుతో ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇండియాలో బిగ్ బాస్ పేరిట ప్రసారమవుతు పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తోంది.పలు భాషలలో ఈ రియాలిటీ షో బిగ్ బాస్ పేరుతోనే ప్రసారమవుతూ ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.

 Bigg Boss Agreement Ended With Star Maa Will It Be Broadcast On Another Channel-TeluguStop.com

తెలుగులో కూడా ఈ కార్యక్రమం 6 సీజన్లను పూర్తి చేసుకుంది.అలాగే ఒక ఓటీటీ సీజన్ కూడా పూర్తి చేసుకుంది.

ఇలా ఆరు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ఏడవ సీజన్ గురించి కూడా అప్పుడే వార్తలు మొదలయ్యాయి.అయితే తాజాగా బిగ్ బాస్ కార్యక్రమానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇండియాలో బిగ్ బాస్ కార్యక్రమాన్ని ఎన్డీమోల్ షైన్ అనే ఒక సంస్థ ఈ షో అధికారికంగా నిర్వహించేందుకుపూర్తి హక్కులను కలిగి ఉంది.అయితే ఈ సమస్థ స్టార్ మాతో ఈ కార్యక్రమం కోసం ఆరు సంవత్సరాల పాటు అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ ఏడాదితో ఈ అగ్రిమెంట్ పూర్తి అయింది.ఇలా అగ్రిమెంట్ పూర్తి కావడంతో సీజన్ సెవెన్ తిరిగి స్టార్ మా లో ప్రసారమవుతుందా లేక ఇతర ఛానల్లో ప్రసారం అవుతుందా అనే విషయం గురించి చర్చలు మొదలయ్యాయి.

ఎన్డీమోల్ షైన్ స్టార్ మాతో వారికి ఉన్నటువంటి అగ్రిమెంట్ పూర్తి కావడంతో ఏడవ సీజన్ ప్రసారం గురించి తిరిగి అగ్రిమెంట్ కుదరచుకోవడం గురించి స్టార్ మాతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.ఒకవేళ ఈ చర్చలు కనుక విఫలమైతే ఎన్డీమోల్ షైన్ వారు ఇతర చానళ్లతో కలిసి ఈ కార్యక్రమాన్ని తమ చానల్లో ప్రసారం చేయడానికి అగ్రిమెంట్ కుదుర్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.వీలైనంతవరకు ఎన్డీమోల్ షైన్ వారు స్టార్ మా తోనే ఈ ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube