ఇటీవల కేరళను వరదలు ఎలా ముంచెత్తాయో, ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీన్‌ను గీత గోవిందం చిత్రం కలెక్షన్స్ ముంచెత్తుతున్నాయి.రెండు వారాల్లో ఈ చిత్రం సంచలన వసూళ్లను నమోదు చేసింది.మరో వారం రోజుల పాటు ఈ చిత్రం సందడి కనిపించడం ఖాయంగా కనిపిస్తుంది.12 రోజుల్లో ఏకంగా 102 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను వసూళు చేసినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.ఈ చిత్రంను బన్నీ వాసు కేవలం 10 కోట్ల లోపు బడ్జెట్‌తో నిర్మించినట్లుగా చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది.

సినిమా ప్రారంభం సమయంలో విజయ్ దేవరకొండకు పెద్దగా క్రేజ్ లేదు.అర్జున్ రెడ్డి విడుదలకు ముందే కమిట్ అయ్యాడు కనుక 50 లక్షలకు కాస్త అటు ఇటుగానే పారితోషికం అందుకున్నాడు.ఇక హీరోయిన్‌తో పాటు ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ అందరికి కలిపినా కూడా రెండున్నర కోట్లకు లోపే పారితోషికాలు ఇచ్చారు.
ఇక నిర్మాణంకు ఏడున్నర కోట్లకు అటు ఇటుగా ఖర్చు చేయడం జరిగిందట.మొత్తంగా 10 కోట్ల లోపు బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం నిర్మాత ఖాతాలో ఏకంగా 65 కోట్ల మేరకు డబ్బును తీసుకు వస్తుందట.

లాంగ్ రన్‌లో ఈ చిత్రం ఖచ్చితంగా 60 కోట్లకు పైగా షేర్ వసూళ్లను సాధించడం ఖాయం.డిస్ట్రిబ్యూటర్స్ షేర్ పోగా ఖచ్చితంగా 50 కోట్లకు పైగానే నిర్మాతకు దక్కుతుంది.ఇక ఇతర రైట్స్ ద్వారా మరో 15 కోట్ల రూపాయలను నిర్మాత దక్కించుకున్నాడు.అంటే మొత్తంగా 65 కోట్లు చిత్రం ద్వారా నిర్మాతకు వెనక్కు వచ్చేస్తున్నాయి.
అయితే 10 కోట్ల రూపాయల బడ్జెట్‌ను తీసి వేస్తే 55 కోట్ల లాభాలు నిర్మాతకు మిగిలినట్లే అంటూ ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.ఇంతటి భారీ వసూళ్లను సాధించి, సరికొత్త రికార్డులను సృష్టించిన గీత గోవిందం చిత్రం బాహుబలి తర్వాత నిర్మాతలకు అత్యధికంగా లాభాలను తెచ్చి పెట్టిన చిత్రాల్లో నెం.1గా నిలిచింది.మహేష్, పవన్, చరణ్, ఎన్టీఆర్ ఇలా స్టార్ హీరోలు కూడా నిర్మాతలకు ఇంత భారీగా లాభాలను తెచ్చి పెట్టలేదు.
కేవలం విజయ్ దేవరకొండ మాత్రమే ఈమద్య కాలంలో ఇంత భారీగా నిర్మాతకు లాభాలు తెచ్చి పెట్టాడు.