పదవి పలుకుబడి ఉంటేనే ఎవరికైనా మర్యాదలు, ఆహ్వానాలు ఉంటాయని ఆ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ఇప్పుడిప్పుడే తెలిసొస్తున్నట్టుంది.జగన్ అక్రమాస్తుల కేసులు విచారణ చేస్తున్న సమయంలో ఆయనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు.
పోలీస్ అంటే లక్ష్మీనారాయణ లా ఉండాలి అనే స్థాయిలో ఆయన పాపులారిటీ పెరిగిపోయింది.ఆ తరువాత ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధం అయ్యారు.

అప్పుడే ఆయన పొలిటికల్ ఎంట్రీ పై రకరకాల ఉహాగానాలొచ్చాయి.ఏపీలో ఉన్న అన్ని పార్టీల్లోనూ ఆయనను చేర్చేశారు విశ్లేషకులు.ఆరెస్సెస్ సమావేశానికి వెళ్లారు కాబట్టి బీజేపీలో చేరుతారన్నారు.జగన్ పై కేసుల్లో దూకుడుగా వ్యవహరించారు కాబట్టి.టీడీపీలో చేరుతారన్నారు.పవన్ కల్యాణ్.
ఆశయాలపై ఎంతో నమ్మకం ఉంచారు కాబట్టి.జనసేనలోకి వెళ్తారని కూడా చెప్పారు.
చివరికి తేలిందేమిటంటే.ఆయనకు ఏ పార్టీ కూడా ఇంత వరకూ తమ పార్టీలో చేరమని ఆహ్వానం పంపలేదట.
ఈ విషయాన్ని ఆయనే స్వయంగా బయటపెట్టారు.
రాజకీయం ప్రవేశంపై ఆయన పూర్తి స్థాయ ప్రణాళికలు వేసుకున్నారని, ఖచ్చితంగా ఆయన ఏ పార్టీలో చేరాలి అనే విషయమై ఒక అవగాహనకు వచ్చిన తరువాతే తన ఉద్యోగానికి రాజీనామా చేశారు అని అంతా భావించారు.
టీడీపీలో చేరుతారని బీజేపీ వారు బీజేపీలో చేరుతారని టీడీపీ వాళ్లు అలాగే జనసేనలో చేరుతారని.ఈ రెండు పార్టీల నేతలు.ఊహించేసుకున్నట్లున్నారు.తమ పార్టీలోకి రమ్మని అడిగినా ప్రయోజనం ఉండదనుకున్నారేమో.
కానీ ఎవరూ లక్ష్మినారాయణను సంప్రదించలేదట.

అసలే ఇప్పుడు రాజకీయ పార్టీలకు ఎన్నికల టెన్షన్ పట్టుకుంది.రాష్ట్రంలో బలమైన నేతలకు గేలం వేసే పని లో బిజీగా ఉన్నాయి.ఇటువంటి సమయంలో లక్ష్మీనారాయణకు ఆహ్వానం అందలేదని స్వయంగా ఆయనే చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఇక లక్ష్మినారాయణ కూడా తన పర్యటనలు చివరిదశకు చేరుకోవడంతో ఇక ఏదో ఒక బలమైన నిర్ణయం తీసుకోక తప్పనిసరి.అందుకే ఆయనే ఏదైనా పార్టీలో చేరేందుకు సంప్రదింపులు చేస్తారా లేక ఆయన సొంతంగా పార్టీ పెడతారా అనే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.







