రిలీజ్ డేట్ విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్న 'ఆర్ఆర్ఆర్'!

టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ RRR.ఈ సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ఇందులో ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుంటే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.

 Rrr Movie Latest Interesting Buzz, Rrr, Rajamouli, Ntr, Ram Charan, Rrr Relese D-TeluguStop.com

ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల అవ్వాల్సి ఉండగా విడుదలను వాయిదా వేశారు.

ఉత్తరాదిన కరోనా కారణంగా థియేటర్స్ ఓపెన్ అవ్వకపోవడంతో రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాను వాయిదా వేశారు.ఇక ఉత్తరాది కూడా తాజాగా ప్రభుత్వాలు థియేటర్స్ లో సినిమాలు రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పడంతో ఇప్పుడు మేకర్స్ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అయితే ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయబోతున్నట్టు వార్తలు ఎప్పటి నుండో వినిపిస్తున్నాయి.ఇక ఇప్పటికే సంక్రాంతి మూడు రోజులు మూడు పెద్ద సినిమాలు బరిలోకి దిగుతున్నాయి.

మహేష్ బాబు సర్కారు వారి పాట, ప్రభాస్ రాధేశ్యామ్, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలు రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అయ్యాయి.

Telugu Rajamouli, Ram Charan, Rrr Latest Buzz, Rrr, Rrr Relese, Sankranti, Tolly

అయితే మొన్నటి వరకు ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా వాయిదా పడుతుంది.ఆ డేట్ లో రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ విడుదల అవుతుందని ఊహాగానాలు వినిపించాయి.కానీ నిన్న రాధేశ్యామ్ మేకర్స్ ఈ సినిమాను జనవరి 14న విడుదల చేయబోనున్నట్టు మరొకసారి స్పష్టం చేయడంతో ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ మేకర్స్ ఎప్పుడు రిలీజ్ చెయ్యాలా అని కన్ఫ్యూజ్ అవుతున్నట్టు టాక్.

అయితే రాజమౌళి ఈ సినిమాను జనవరిలోనే తప్పకుండ విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడని తెలుస్తుంది.ఉన్న కొద్దీ వర్క్ కూడా పూర్తి చేసి మొదటి కాపీ రెడీ గా పెట్టుకోబోతున్నట్టు సమాచారం.

ఇక ప్రస్తుతానికి అయితే ఈ సినిమాను జనవరి 8న విడుదల అవుతుంది అనే బజ్ అయితే వినిపిస్తుంది.ఇంకా దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube