బీజేపీ జాతీయాధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డాకు తెలంగాణ గడ్డ కలిసొచ్చిందా? అని చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.ఆయన తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు వచ్చి చేయాలనుకున్నది చేసేశారు.
ఈ సందర్భంగా కేసీఆర్ పాలనపై, టీఆర్ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు.వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని అప్పుడు అన్ని వర్గాలకు సమ న్యాయం అందిస్తామని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 371 విషయంలో బీజేపీ పార్టీ ధర్నాలు రాస్తారోకోలు చేస్తుంది.టీచర్ల హక్కులకు ఈ జీవో భంగం కలిగిస్తుందని తెలంగాణ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
వారికి సంఘీభావంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జాగరణ పేరుతో దీక్ష చేస్తుండగా.పోలీసులు వచ్చి ఆయన దీక్షను భగ్నం చేసి సంజయ్ ని అరెస్టు చేశారు.
కోర్టులో సంజయ్ ని ప్రవేశపెట్టగా కోర్టు సంజయ్ కి 14 రోజుల రిమాండ్ విధించింది.ఈ తీర్పుపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కోర్టు సంజయ్ కి కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని చెప్పి తీర్పు వెలువరించింది.
అయితే కేవలం బీజేపీ నాయకులే కోవిడ్ రూల్స్ ఉల్లంఘిస్తారా? టీఆర్ఎస్ నాయకులు చేపట్టే బైక్ ర్యాలీలు, రోడ్ షోలలో కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించడం లేదా? అని వారు ప్రశ్నిస్తున్నారు.బీజేపీ అధ్యక్షుడికి సంఘీభావం తెలపడానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా రాష్ట్రానికి వచ్చారు.ఈ సందర్భంగా క్యాండీల్ ర్యాలీ నిర్వహించేందుకు బీజేపీ ప్లాన్ చేయగా.
అందుకు పోలీసులు అనుమతిని నిరాకరించారు.ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలను పాటించాల్సిందేనని నార్త్ జోన్ డీసీపీ చందన దీప్తి వెల్లడించారు.
కరోనా నిబంధనలను పాటించకుండా వ్యవహరిస్తామంటే పోలీసులు చూస్తూ ఊరుకోరని ఆమె స్పష్టం చేశారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో.