హీరోలను అడిగే అంత ధైర్యం ఉందా... శ్రియ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న శ్రియ( Shriya ) ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.తాజాగా ఈమె మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) హీరోగా నటిస్తున్న భోళా శంకర్ (Bhola Shankar) సినిమాలో స్పెషల్ సాంగ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ప్రస్తుతం ఈమెకు పెళ్లి అయి ఒక కూతురు ఉన్నప్పటికీ అదే అందంతో అభినయంతో సినిమా అవకాశాలను అందుకొని దూసుకుపోతున్నారు.ఇదే విషయం గురించి గతంలో శ్రీయను ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించగా ఈమె సమాధానం చెబుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

గత కొద్ది రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి శ్రీయని యాంకర్ ప్రశ్నిస్తూ మీకు పెళ్లి జరిగి కూతురు ఉన్నప్పటికీ అంతే అందంగా ఉన్నారు.ఇలా అందంగా ఉండడానికి కారణం ఏంటి అని ప్రశ్నించారు.అయితే ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ… ఇదే ప్రశ్న మీరు హీరోలను( Heroes ) కూడా అడుగుతారా అంటూ ఎదురు ప్రశ్న వేశారు.ఇక ఇదే విషయంలో నా ఫ్రెండ్స్ తరచు తనని అడుగుతుంటారని కూతురు పుట్టిన తర్వాత కూడా అంతే అందంగా ఉన్నారంటే నమ్మలేకపోతున్నాం అని చెప్పారు.

అయితే ఇక్కడ అందం ఒక్కటే ముఖ్యం కాదని తెలిపారు.

ఇక్కడ అందం కాకుండా నా వయసు ముఖ్యం…నేను ఇండస్ట్రీలో ఎంత కాలం పాటు కొనసాగుతున్నాను అనేది ముఖ్యం.అయితే ఇలాంటి ప్రశ్నలు మమ్మల్ని అడిగినంత సులువుగా హీరోలను అడగలేరు.వారిని అడిగే అంత ధైర్యం కూడా లేదు.

అయితే మీరు ఎప్పుడైతే ఈ ప్రశ్న హీరోలను అడుగుతారో ఆ రోజు నేను తప్పకుండా సమాధానం చెబుతాను అంటూ ఈ సందర్భంగా శ్రియ యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడంతో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.అయితే శ్రీయ చెప్పిన ఈ సమాధానం పై ఎంతోమంది స్పందిస్తూ చాలా కరెక్ట్ గా చెప్పారని శ్రీయ ఏ విషయం అయినా ఇలా ముక్కుసూటిగానే మాట్లాడుతారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube