సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి లో అగ్నిప్రమాదం

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.ఒక్కసారిగా రోగులు ఆందోళనకు గురయ్యారు.

 Fire Accident In Secunderabad Gandhi Hospital,  Fire Accident ,secunderabad Gand-TeluguStop.com

దట్టమైన పొగలు కమ్ముకోవడంతో రోగులు పరుగులు తీశారు.మొదటి అంతస్తులో విద్యుత్ ప్యానెల్ బోర్డు షార్ట్ సర్క్యూట్ కారణంగా 6 ఫ్లోర్ లలో ఉన్న ప్యానెల్ బోర్డు లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

అప్రమత్తమైన గాంధీ సిబ్బంది రోగులను బయటకు వెళ్లాల్సిందిగా సూచించడంతో లేబర్ డిపార్ట్మెంట్ లో బాలింతలు, పసి పిల్లల్ని ఎత్తుకొని బయటకు పరుగులు తీశారు.కొందరు వీల్చైర్ లో రాగ మరికొందరు పసిగుడ్డులను ఎత్తుకొని పరుగులు తీశారు.

అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ ద్వారా మంటలు చెలరేగిన ప్యానెల్ బోర్డు లో మంటలను ఆర్పారు.గాంధీ సూపర్డెంట్ రాజారామ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ఈ ప్రమాదం సంభవించిందని రోగులు అంతా సురక్షితంగా ఉన్నారని ఫైర్ అధికారి, గాంధీ సూపరింటెండెంట్ తెలిపారు.

ఈ ఘటన పై స్పందించిన స్థానిక ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశు, పాడి, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

Telugu Gandhi Rajarao, Short Circuit, Sixth Floor-Latest News - Telugu

గాంధీ సూపర్డెంట్ డాక్టర్ రాజారావు తో సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి ఘటనకు జరిగిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.తాను హుజురాబాద్ ఎలక్షన్ క్యాంపింగ్ లో ఉన్నానని, ప్రభుత్వ గాంధీ ఆసుపత్రి పేదల వైద్య సేవలకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలని, ప్రభుత్వం ఎప్పుడు వైద్య సేవలకు పూర్తి సహకారాన్ని అందిస్తుందని ఆయన ఆదేశించారు.తాను హైదరాబాద్ చేరుకోగానే గాంధీని సందర్శిస్తానని ఫోన్లో మాట్లాడారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube