పడుకునే ముందు..లేచిన తర్వాత ఏ దేవుడిని స్మరించుకోవాలి... ఎందుకు స్మరించుకోవాలో తెలుసా?
TeluguStop.com
సాధారణంగా మనం ప్రతి రోజు పడుకునే సమయంలో నిద్ర లేచే సమయంలో చాలామంది వారి ఇష్ట దైవాన్ని తలచుకుని పడుకోవడం లేదా ఉదయం లేచేటప్పుడు వారి ఇష్టదైవాన్ని తలుచుకుంటూ నిద్రలేవడం చేస్తుంటారు.
అయితే నిద్ర పోయేటప్పుడు, నిద్ర లేచినప్పుడు తప్పనిసరిగా ఏదో ఒక దేవుడిని అయితే తలుచుకుంటారు.
కానీ ఏ దేవుడిని తలచుకోవడం వల్ల మంచి జరుగుతుంది అనే విషయానికి వస్తే.
ప్రతిరోజు మన నిద్రపోయే సమయంలో మనం తప్పనిసరిగా ఆ పరమశివుని స్మరించుకోవాలి.ఈ క్రమంలోనే నిద్రపోయే ముందు ఓం నమశ్శివాయ అంటూ ఆ పరమేశ్వరుడిని స్మరించుకొని నిద్రపోవాలని పండితులు చెబుతున్నారు.
ఈ విధంగా పరమేశ్వరుడిని తలుచుకుని నిద్రపోవడం వల్ల మనకు కలలో ఏ విధమైనటువంటి పీడకలలు రావని నిద్రపోతున్న సమయంలో ఎలాంటి భయాందోళనలు ఉండవని సుఖంగా ప్రశాంతంగా నిద్ర వస్తుందని అందుకే నిద్ర పోయే ముందు తప్పనిసరిగా ఆ పరమేశ్వరుని నామస్మరణ చేస్తూ నిద్ర పోవాలని పండితులు చెబుతున్నారు.
అలాగే ఉదయం నిద్ర లేచేటప్పుడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు శ్రీమన్నారాయణుడిని తలచుకొని నిద్ర లేవాలని పండితులు చెబుతున్నారు.
"""/" / ఈ విధంగా విష్ణుమూర్తిని తలుచుకుని నిద్ర లేవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.
విష్ణువు అంటే స్థితి కారుడు.అందుకే ప్రతిరోజు ఉదయం అతని నామస్మరణ చేస్తూ నిద్రలేవడం వల్ల ఆ రోజు మొత్తం మనల్ని ఎంతో ఆనందంగా సంతోషంగా ముందుకు నడుపుతారు.
ప్రతిరోజు ఆ నారాయణుడి మంత్రం జపిస్తూ నిద్రలేవడం వల్ల రోజంతా ఎంతో ప్రశాంతంగా గడుస్తుంది.
ఇలా నిద్ర పోయేముందు పరమేశ్వరుడిని నిద్రలేచిన తర్వాత నారాయణుడిని స్మరించుకోవడం ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు.
కుబేర సినిమాతో శేఖర్ కమ్ముల పాన్ ఇండియాలో సక్సెస్ సాధిస్తాడా..?