స్కిట్ లో భాగంగా చలాకీ చంటి పరువుతీసిన రోజా..!

జబర్దస్త్ షో మొదలైనప్పటి నుంచి ఎంతో మంది కమెడియన్స్ తెలుగు తెరకు పరిచయమైన వారు ఉన్నారు.అయితే బుల్లితెరపై కొనసాగుతున్న జబర్దస్త్ షో లో మొదట్లో ఉన్న వారు ఎవరు ఇప్పుడు కొనసాగడం లేదు.

 Judge Roja, Chalaki Chanti, Jabardasth, Skits, Eetv Program-TeluguStop.com

మధ్యలో కొంతమంది జబర్దస్త్ షో నుండి వెళ్ళిపోయారు.అలా బయటికి వెళ్లిన వారు మళ్ళీ తిరిగి వచ్చారు.

ఇలా బయటికి వెళ్లి మళ్ళీ లోపలికి వచ్చే సమయంలో జబర్దస్త్ షో లో ఎన్నో మార్పులు జరిగిపోతున్నాయి.అంతవరకు ఓ టీం లో కీలక వ్యక్తిగా ఉన్న వ్యక్తి ఆ తర్వాత టీం లీడర్ గా మారిపోయారు.

ఇది వరకు జబర్దస్త్ షో మొదలైనప్పుడు టీం లీడర్ గా ఉన్న వాళ్ళు కొద్ది రోజులు జబర్దస్త్ షో వదిలి వెళ్లిపోవడంతో ఆ సమయంలో వారి ఉనికికే ప్రమాదం వచ్చింది.ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు అని చెప్పవచ్చు.

వేణు, ధనరాజ్, తాగుబోతు రమేష్ ఇలాంటి వారు సినిమా ఫీల్డ్ కు వెళ్లిపోగా మరికొందరు అనవసరంగా జబర్దస్త్ షో నుంచి బయటికి వెళ్ళిపోయిన ఉన్నారు.అలా బయటికి వెళ్ళిన వారు కొన్ని రోజులు బాగానే ఉన్నా ఆ తర్వాత వారికి రోజులు గడవడం కష్టం అయిపోయింది.

ఇందులో భాగంగానే చలాకి చంటి మాత్రం ఈటీవీలో ఇతర షో లు చేసుకుంటూ ఉన్నాడు.అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ రెండు సార్లు బయటికి వెళ్లి మళ్లీ వచ్చిన చలాకి చంటి మరోసారి జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఇచ్చి స్కిట్స్ చేస్తున్నారు.

అయితే తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమో లో చలాకి చంటి పరువు తీసేసింది జడ్జి రోజా.

స్కిట్ లో భాగంగా చలాకి చంటి తాను 2013 నుంచి టీం లీడర్ గా ఉన్నానని, హైదరాబాద్ లో ఉంటున్నానని తెలుపుతుంటే మధ్యలో రోజా కలుగజేసుకుని రెండు సార్లు బయటికి వెళ్లి వచ్చావు అంటూ గుర్తు చేసింది.

దీంతో చలాకి చంటి చేసేదేమిలేక అదే అంటూ స్కిట్ ను కంటిన్యూ చేశాడు.రోజా మాట్లాడిన మాటలు చూస్తే ఇది స్క్రిప్టు కోసం కాకపోయినా ఎవరైతే జబర్దస్ నుండి బయటికు వెళ్ళిపోయారో వాళ్ళకి ఏ రకమైన చర్యలు ఉంటాయని చెప్పకనే చెప్పింది అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube