ఇప్పటికే ఒక 20 సార్లు పెళ్లి చేసుకొని ఉంటాను.. చిన్నారి పెళ్లికూతురు షాకింగ్ కామెంట్స్?

చిన్నారి పెళ్లికూతురు సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటి అవికా గోర్( Avika Gor ).పదేళ్ల వయసులోనే ఈ సీరియల్ లో నటించి దేశవ్యాప్తంగా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి ఈమె అనంతరం హీరోయిన్గా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

 I Married Tewnty Times Actress Avika Gor Comments Viral , Avika Gor, Vadhuvu, Tw-TeluguStop.com

ఈమె తెలుగులో ఉయ్యాల జంపాల( Uyyaala Jampaala ) అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అవికా అనంతరం పలు సినిమాలలో హీరోయిన్ గా నటించారు.

అయితే ఉన్నఫలంగా ఈమె ఇండస్ట్రీకి కొంత కాలం పాటు బ్రేక్ ఇచ్చారు.

Telugu Avika Gor, Tollywood, Twenty Times, Vadhuvu-Movie

ఇలా ఇండస్ట్రీకి బ్రేక్ ఇవ్వడంతో తిరిగి ఇండస్ట్రీలో నిలుదొక్కుకోవడానికి కష్టతరం అవుతుంది.అంతేకాకుండా ఈమెకు సినిమా అవకాశాలు కూడా రాకపోవడంతో వెబ్ సిరీస్ ల వైపు దృష్టిసారించింది.ప్రస్తుతం ఈమే వరుస వెబ్ సిరీస్ లలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

మాన్షన్ 24 ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అవికా ప్రస్తుతం వధువు ( Vadhuvu ) అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సిరీస్ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది.

ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

Telugu Avika Gor, Tollywood, Twenty Times, Vadhuvu-Movie

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె ఎన్నో విషయాలను తెలియజేశారు.ముఖ్యంగా పెళ్లి గురించి ప్రస్తావన రావడంతో నేను ఇప్పుడు ఆన్ స్క్రీన్ పై ఏకంగా 20 సార్లు పెళ్లి ( 20 Times Marriage ) చేసుకుని ఉంటాను అంటూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.చిన్నారి పెళ్లికూతురు సమయంలో నాకు పదేళ్ల వయసు అప్పుడు పెళ్లికూతురు అంటే ఎలా ఉండాలి ఇంట్లో ఎలా మెలగాలనే విషయాలు తెలియవు.

అప్పటినుంచి నేను పెళ్లికూతురుగా మేకప్ అవుతూ వచ్చానని ఇప్పటివరకు నటించిన సీరియల్స్ సినిమాలలో దాదాపు 20 సార్లు పెళ్లికూతురుగా ముస్తాబయి ఉంటానని దాంతో వధువు సిరీస్లో చేయడానికి నాకేం పెద్దగా కష్టం అనిపించలేదు అంటూ ఈ సందర్భంగా అవికా చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube