దేశంలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న పార్టీ కాంగ్రెస్. ఎంతోమంది గొప్ప నాయకులను దేశానికి అందించిన చరిత్ర ఆ పార్టీది.ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది.పార్టీని నడిపించే నాధుడు లేక బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు ఆ పార్టీ శ్రేణులు.కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతున్నప్పటికీ రాహుల్ గాంధీ అసంతృప్తితోనే ఉన్నాడు.ఆ పదవిని చేపట్టడానికి సోనియాగాంధీ కూడా విముఖత వ్యక్తం చేస్తోంది.
ప్రియాంక, రాబర్ట్ వాద్రా లు కూడా అఇష్టంగానే ఉన్నారు.దీంతో పార్టీకి దిక్కెవరా.? అన్న ప్రశ్న తలెత్తుతుంది.
కాంగ్రెస్ పై బీజేపీ నేతల ప్రచారం:
కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకి తీసికట్టుగా మారుతోంది.దీంతో కాంగ్రెస్ పని అయిపోయిందని బిజెపి ప్రచారం ముమ్మరం చేసింది.మోడీ హవా కు తిరుగులేదని కాంగ్రెస్ ఇక బ్రతక లేదని కూడా బిజెపి ప్రచారం చేస్తుంది.
కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ మధుసూదన్ మిస్త్రీ ఆగస్టు 10న సోనియాగాంధీకి లేఖ రాశారు.పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు 9100 మంది ఓటర్లు ఉన్నట్టు తెలిపారు.21 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని నామినేషన్ల దాఖలుకు తుదిగడువు 28 అని సెప్టెంబర్ నాటికి మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తి అవుతుందని చెప్పాడు.పార్టీ అధ్యక్షుడిగా నామినేషన్ దాఖలు చేయాలని సోనియా గాంధీ రాహుల్ గాంధీకి చెప్పినా ప్రయోజనం లేకుండా పోతుంది.2019 ఎన్నికల ఓటమి తర్వాత అయన తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి చేపట్టనని తేల్చి చెప్పాడు.రాహుల్ గాంధీ కి ఎంత నచ్చ చెప్పినా ఫలితం లేకుండా పోతుంది.
దీంతో తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ ఉండేటట్లు సీనియర్ నేతలు ఆమెను ఒప్పించారు.

దేశవ్యాప్తంగా అన్ని నిర్ణయాల్లో రాహుల్ గాంధీ మౌనం పాటిస్తున్నారు.ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడిగా ఏ ఒక్కరు కూడా నామినేషన్లు దాఖలు చేయని పరిస్థితి వస్తుందేమోనని సీనియర్లు భయపడుతున్నారు.ఒకవైపు రాహుల్ గాంధీ ఒప్పుకోకపోవడం, మరోవైపు సోనియ గాంధీ ఆరోగ్యం సహకరించక పోవడం ఫలితంగా కాంగ్రెస్ దిక్కులేనిదైపోతుందని అందరూ అనుకుంటున్నారు.
దీంతో సీనియర్లు ప్రియాంక, వాద్రా ల పేర్లను తెరమీదికి తెస్తున్నారు.ఇటీవల ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో ప్రియాంక దగ్గరుండి ప్రచారం చేసినా కాంగ్రెస్ పరిస్థితి మారలేదు.
కాంగ్రెస్ సీనియర్లు మాత్రం రాహుల్ గాంధీకి నచ్చజెబుతున్నట్లు సమాచారం.ఆ పదవిని ఎలా భర్తీ చేయాలో చెప్పాలని సీనియర్లు రాహుల్ గాంధీని కోరుతున్నట్లు వినికిడి.
దీంతో కాంగ్రెస్ పని అయిపోయిందని బీజేపీ వర్గాలు సంబరాల్లో మునిగి తేలుతున్నాయి.