తెలంగాణకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్న విషయం తెలిసిందే.మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతోంది.
దీనిలో భాగంగా మునుగోడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అమిత్ షా హాజరుకానున్నారు.
అయితే, ఈ పర్యటనలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
అమిత్ షాతో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భేటీ కానున్నారు.షా ఆహ్వానం మేరకు 15 నిమిషాల పాటు సమావేశం అవనున్నారని సమాచారం.ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన షా.ఎన్టీఆర్ నటనకు ఫిదా అయి ప్రశంసిస్తూ ఆహ్వానించినట్లు తెలుస్తోంది.







