నెంబర్ వన్‌పై పూజా హెగ్డే ఏమందంటే?

అందాల భామ పూజా హెగ్డే టాలీవుడ్‌లో ఎలాంటి క్రేజీ హీరోయిన్‌గా మారిందో అందరికీ తెలిసిందే.

ప్రతి స్టార్ హీరో ఆమెను తమ సినిమాల్లో పెట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

పూజా హెగ్డే తమ సినిమాలో ఉంటే ఖచ్చితంగా సక్సెస్ కొట్టొచ్చని వారు అనుకుంటున్నారు.కాగా ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ అల వైకుంఠపురములో సినిమాతో అదిరిపోయే సక్సెస్ అందుకున్నాడు.

ఈ సినిమాలో పూజా హెగ్డే అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది.పూజా హెగ్డే పాత్రకు కూడా మంచి మార్కులు పడటంతో ఈ సినిమా అందించిన సక్సెస్‌తో ఆమె ఫుల్ హ్యాపీగా ఉంది.

ఇక ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 20వ చిత్రంలోనూ పూజా హీరోయిన్‌గా నటిస్తోంది.అటు మరో యంగ్ హీరో అఖిల్ అక్కినేని సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రంలోనూ అమ్మడు నటిస్తోంది.

Advertisement

ఇలా వరుసగా క్రేజీ ఆఫర్లు కొల్లగొట్టిన ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోయిన్‌గా నిలిచింది.ఇక తాను ఇలా నెంబర్ వన్ స్థానంలో నిలవడం నిజంగా సంతోషంగా ఉందని, బాలీవుడ్‌లోనూ నెంబర్ వన్ స్థానానికి చేరుకోవాలనేది తన కల అని అంటోంది ఈ బ్యూటీ.

మరి బాలీవుడ్‌లో పూజా పాప నెంబర్ వన్‌కు చేరుకుంటుందా లేదా అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు