పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Powerstar Pawan Kalyan ) ఒకవైపు జనసేన పార్టీ పనులను చక్కబెడుతూనే మరో వైపు తన లైనప్ లోని సినిమాలను పూర్తి చేసుకుంటూ పోతున్నాడు.మరి పవన్ లైనప్ లో ఉన్న క్రేజీ సినిమాల్లో ఓజి ఒకటి.
టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ ”ఓజి”.ఇప్పటికే ఈ సినిమా 50 శాతానికి పైగానే షూట్ పూర్తి చేసుకుంది.
ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 2న పుట్టిన రోజు( Pawan Kalyan Birthday ) జరుపుకోనున్నారు.ఈ బర్త్ డే కానుకగా ఈయన సినిమాల నుండి అప్డేట్స్ కోసం అంతా ఎదురు చూస్తుండగా నాలుగు రోజులు ముందుగానే ఓజి( OG Movie ) మేకర్స్ టీజర్ రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ ద్వారా అఫిషియల్ గా ప్రకటించారు.
మరి ఈ అప్డేట్ పై ఇప్పుడు అదిరిపోయే సమాచారం బయటకు వచ్చింది.టీజర్ 72 సెకన్ల నిడివితో రాబోతుంది అని తెలుస్తుంది.ఈ టీజర్ లో పవన్ కళ్యాణ్ ఒరిజినల్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు అని తెలియడంతో ఈ వార్త ఫ్యాన్స్ లో సంతోషం నింపింది.అంతేకాదు ఈ టీజర్ మొత్తం అర్జున్ దాస్ వాయిస్ ఓవర్( Arjun Das ) తో ప్రత్యేకంగా ఉండబోతుందట.

ఇక టీజర్ మాత్రమే కాదు టైటిల్( OG Movie Title and Teaser ) కూడా రివీల్ చేయనున్నారట.ఇప్పటికే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.కానీ ఇప్పుడు మరో టైటిల్ వినిపిస్తుంది.పవన్ రోల్ పేరునే టైటిల్ గా పెట్టబోతున్నారట.ఓజాసా గంభీర్( Ojas Gambheera ) గా పవన్ నటిస్తున్నాడని ఇదే పేరును సినిమాకు టైటిల్ గా ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.చూడాలి ఇందులో నిజమెంతో…
ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా ప్రియాంక మోహన్( Priyanka Mohan ) హీరోయిన్ గా నటిస్తుంది.
అలాగే ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.







