కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కి మరో కీలక పదవి 

శ్రీకాకుళం ఎంపీ , కేంద్ర పౌర విమానం శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు( Kinjarapu Rammohan Naidu ) మరో కీలక పదవి దక్కింది .ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్ గా రామ్మోహన్ నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

 Another Key Post For Union Minister Rammohan Naidu, Kinjarapu Rammohan Naidu, Sr-TeluguStop.com

టిడిపి , బిజెపి( TDP, BJP ) పొత్తులో భాగంగా రామ్మోహన్ నాయుడుకు కేంద్రమంత్రి పదవి దక్కగా,  ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మరో పదవి దక్కడం పై టిడిపి శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Telugu Key Rammohan, Srikakulam Mp-Politics

ఇది భారతదేశానికే కాకుండా తెలుగుదేశం పార్టీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడానికి దోహదం చేస్తుందని టిడిపి నేతలు ఆకాంక్షిస్తున్నారు.  దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న రెండో ఆసియా పసిఫిక్ మంత్రుల స్థాయి సదస్సులో రామ్మోహన్ నాయుడును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.రామ్మోహన్ నాయుడు పేరును సింగపూర్ ప్రతిపాదించగా , భూటాన్ బలపరిచింది.

  మిగతా సభ్య దేశాలన్నీ దీనికి ఏకగ్రీవంగా ఆమోదం తెలపడంతో ఆయన చైర్మన్ గా ఎన్నికయ్యారు.భారత్ తరపున ఈ అరుదైన గౌరవం దక్కడం తనకు ఎంతో ఆనందంగా ఉందని రామ్మోహన్ నాయుడు అన్నారు.

Telugu Key Rammohan, Srikakulam Mp-Politics

భారత దేశం తరఫున తనకు దక్కిన ఈ గౌరవాన్ని తాను బాధ్యతగా స్వీకరిస్తానని , పౌర విమానయాన రంగాన్ని సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తను వంతు ప్రయత్నం చేస్తానని రామ్మోహన్ నాయుడు అన్నారు.నిన్న న్యూఢిల్లీలోని భారత్ మండపంలో పౌర విమానానికి సంబంధించిన రెండవ ఆసియా పసిఫిక్ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ ను రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన , సహకార శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్( Muralidhar Mohol ) , ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ సాల్వ్ టోర్ సియాచిటావో, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఉమ్లున్మాగ్ తో పాటు 29 దేశాలకు చెందిన ప్రతినిధులు కూడా హాజరయ్యారు.ఇక రామ్మోహన్ నాయుడుకి అంతర్జాతీయ స్థాయిలో పదవి దక్కడం పై ఆయన సొంత నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా లోనూ పండగ వాతావరణం నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube