ఫోన్ లేనిదే ప్రస్తుతం మనుగడ లేనంతగా ఇవి జనాల జీవితాల్లో ఓ భాగం అయిపోయాయి.చిన్నా పెద్దా అని తేడాలేకుండా ప్రతి ఒక్కరూ ఫోన్‌పై ఆధారపడుతున్న పరిస్థితి.
ఇతరులతో మాట్లాడటానికి కావచ్చు, ఫొటోలు తీయడానికి కావచ్చు, బ్యాంకింగ్, డాక్యూమెంట్స్ ఇలా కారణం ఏడైనా ఫోన్ ఉండాల్సిందే.ముఖ్యంగా పర్సనల్ ఫొటోలతో, మరెన్నో కీలక విషయాలు ఫోన్లో భద్రపరుచుకుంటారు.
అందుకే ఫోన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా అవసరం.ఒకవేళ ఫోన్ హ్యాక్ అయితే, పర్సనల్ ఫొటోలు, కాల్ రికార్డింగ్స్( Call recordings ), వీడియోలు ఇలా ఎన్నో లీకై చాలా తలనొప్పులు వస్తూ ఉంటాయి.

అందుకే ఫోన్ విషయంలో వినియోగదారులు ఎల్లపుడూ అప్రమత్తంగా ఉండటం తప్పనిసరి.ఇకపోతే ప్రస్తుతం హ్యాకర్లు మీ స్క్రీన్‌ను రహస్యంగా రికార్డ్ చేసే కొత్త హ్యాకింగ్ మార్గం ఒకటి బయటకు వచ్చింది.ఇక్కడ ఇబ్బందికరమైన విషయం ఏమంటే, మీ స్క్రీన్ రికార్డ్ అవుతున్నప్పుడు, వినియోగదారులకు కూడా తెలియకుండా ఫోన్ స్క్రీన్ రికార్డింగ్( Phone screen recording ) చేస్తుండడం.ఈ క్రమంలో మోసగాళ్ళు డేటాను దొంగిలించి దానితో బెదిరిస్తుంటారు.
ఇక అందులో బ్యాంక్ వివరాలు ఉన్నట్టయితే ఇక అంతే.మీరు చాలా కాలం పాటు ఇబ్బందులు పడే అవకాశం లేకపోలేదు.

ఇటువంటి పరిస్థితిలో, ఎవరైనా మన ఫోన్ స్క్రీన్‌ను రికార్డ్ చేస్తున్నారని ఎలా తెలుసుకోవాలనే ప్రశ్న అందరికీ రావడం సహజమే.కనుక్కోవడం అంత సులభం కాదు.కానీ, కొన్ని ఫోన్లలో ప్రత్యేకమైన ఫీచర్లు ఉన్నాయి.దీని కారణంగా మీ కెమెరా లేదా మైక్ ఉపయోగించినట్లయితే, గ్రీన్ కలర్ లైట్ బర్నింగ్ అవుతూ ఉంటుంది.ఈ ఫీచర్ చాలా ఫోన్లలో అందుబాటులో ఉంది.ఫీచర్ కింద, మీ ఫోన్ మైక్ లేదా కెమెరా బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేస్తుంటే, దాని స్క్రీన్‌పై గ్రీన్ డాట్ లైట్ కనిపిస్తుంది.
మీ ఫోన్లో స్క్రీన్ రికార్డ్ అవుతుంటే లేదా కెమెరా ఉపయోగించబడుతుంటే, మీరు ఫోన్‌కు కుడి వైపున గ్రీన్ లైట్( Green light ) ఒకటి కనిపిస్తుంది.స్క్రీన్ రికార్డింగ్ యాప్ ద్వారా జరుగుతుంటే, ముందుగా ఏ యాప్ నుంచి రికార్డింగ్ జరుగుతుందో చూడండి.
ఆ తరువాత ఆ యాప్‌ని గుర్తించిన వెంటనే తొలగించండి.







