ఈ పండగ సీజన్లో రానున్న 5 కొత్త కార్లు ఇవే.. ధర ఎంతో తెలుసా?

కార్ల ప్రేమికులను ఈ పండుగ సీజన్‌లో 5 కొత్త SUVలు పకరించనున్నాయి.కాగా వాటి మోడళ్లపై చాల కాలంగా ఉత్కంఠత నెలకొంది.

 These Are The 5 New Cars Coming This Festive Season Do You Know The Price, Cars,-TeluguStop.com

ఈ సంవత్సరం కొత్త కార్ కొనేందుకు ప్లాన్ చేస్తున్న వీటిపై ఓ లుక్కేయవచ్చు.ఈ లిస్టులో మొదటగా “హోండా ఎలివేట్”( Honda Elevate ) గురించి మాట్లాడుకోవాలి.

కొన్ని నెలల క్రితమే ఇది మనదగ్గర లాంచ్ అయింది.ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా పరిచయం కావడానికి సిద్ధంగా వుంది.

హోండా ఇప్పటికే ఈ SUV ఉత్పత్తిని దాదాపు మొదలు పెట్టింది.ప్రస్తుతం రూ.5,000 బుకింగ్‌లతో మొదలయ్యింది.సెప్టెంబరులో నుండి సేల్స్ ఉండగా దీని ధర రూ.11 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ఉంటుందని అంచనా.

Telugu Cars, Honda Elevate, Latest, Tatanexon, Ups-Latest News - Telugu

ఈ లిస్టులో 2వది “సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్”( Citroen C3 Aircross ) సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్ తర్వాత ఫ్రెంచ్ మార్కెట్‌లో లాంచ్ అయిన 2వ SUV ఇది.దీని బుకింగ్‌లు సెప్టెంబర్‌లో స్టార్ట్ అవుతాయి.ఇక దీని ధర విషయానికొస్తే రూ.11 లక్షలు (ఎక్స్-షోరూమ్).ఇది 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను కలిగి వుంది.ఇంకా దీనికి 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ జత చేసారు.

ఇందులో 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, మాన్యువల్ AC, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే వంటి అంశాలు ఉన్నాయి.సేఫ్టీ విషయంలో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, రివర్సింగ్ కెమెరా అండ్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) ఉన్నాయి.

Telugu Cars, Honda Elevate, Latest, Tatanexon, Ups-Latest News - Telugu

ఇక 3వ కార్ “టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్.”( Tata Nexon Facelift ) ఇది ఇప్పటికే చాలాసార్లు టెస్టింగ్ చేయబడింది.టాటా నెక్సాన్ ధరలు రూ.8 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయని అంచనా వుంది.1.2-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్‌ తో ప్రస్తుత మోడల్ నుండి అదే 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.ఈ లిస్టులో 4వ కార్ “టా నెక్సాన్ EV ఫేస్‌లిఫ్ట్.” దీని ధర రూ.15 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.ఇది 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరాను అందించడం దీని ప్రత్యేకత.ఇక చివరిది “5-డోర్ల పోర్స్చే గూర్ఖా.” దీనికోసం వినియోగదారులు చాలాకాలంగా ఎదురు చూస్తున్నారు.ఈ పండుగ సీజన్‌లో దీనిని రూ.16 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో విక్రయించనున్నట్లు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube