వచ్చె అసెంబ్లీ ఎన్నికలలోబీసీలకు అన్యాయం చేస్తే సహించేది లేదు

అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 60 సీట్లు కేటాయించాలి బి ఆర్ యస్ విడుదల చేసిన జాబితాను సవరించాలికాంగ్రెస్, బిజెపి పార్టీలు సీట్ల కేటాయింపులో సామాజిక న్యాయం పాటించాలి రాజన్న సిరిసిల్ల జిల్లా:అరవై శాతం ఉన్న బీసీలకు 20 శాతం 10 శాతం ఉన్న అగ్రవర్ణాలకు 60 శాతం టికెట్లు కేటాయించారంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) కేంద్రంలోని అంబేద్కర్ వద్ద బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వీర వేణి మల్లేష్ యాదవ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ ల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ సంఘాల నిరసన కార్యక్రమం నిర్వహించారు.ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు పాల్గొన్నారు.

 Injustice To The Bcs In The Coming Assembly Elections Will Not Be Tolerated-TeluguStop.com

ఈ సందర్భంగా పర్శ హన్మాండ్లు మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీసీలకు అన్యాయం చేస్తే సహించేది లేదని బీసీలకు 50% సీట్లు అన్ని రాజకీయ పార్టీలు కేటాయించవలసిందదెనని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు అన్నారు.ఈ మధ్యలో టిఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన జాబితాలో బీసీలకు కేవలం 23 సీట్లు కేటాయించడం పట్ల బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఖండిస్తున్నట్లు పర్శ హన్మాండ్లు తెలిపారు.బిఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన జాబితాను వెంటనే సవరించి బీసీలకు 50% టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

60%ఉన్న బీసీలకు 20% 10%జనాభా ఉన్న అగ్రవర్ణాలకు 60 శాతం సీట్లు కేటాయించడం శోచనీయమన్నారు.బీసీలలో 136 కులాలు ఉంటే కేవలం ఐదు కులాలకే టికెట్లు ఇచ్చారని మిగిలిన కులాల పరిస్థితి ఏంటిదని పర్శ హన్మాండ్లు ప్రశ్నించారు.గతంలో టిఆర్ఎస్ 25 మంది బీసీలకు టికెట్ కేటాయించిందని ఇప్పుడు ఉన్నదాంట్లోని హుజురాబాద్, కామారెడ్డి ( Huzurabad )బీసీ టికెట్లకు కోత పెట్టడం సమంజసం కాదన్నారు.

బీసీలకు సామాజిక న్యాయం దక్కేవరకు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పోరాటం చేస్తూనే ఉంటామన్నారు.బారాస పార్టీ( BRS party ) ప్రకటించిన జాబితాను వెంటనే సవరించి బీసీలకు న్యాయం చేయాలని పర్శ హాన్మాండ్లు సందర్భంగా డిమాండ్ చేశారు.

సెప్టెంబర్ మొదటివారం వరకు రాజకీయ పార్టీల వైఖరిని చూస్తామని అప్పటివరకు మార్పులు చేర్పులు చేసి బీసీలకు న్యాయం చేస్తే సరేనని లేకపోతే హైదరాబాదులో సెప్టెంబర్ 10 నాడు ఐదు లక్షల మందితోని బీసీ సింహగర్జన పెడతామని ఆ రోజే రాజకీయ పార్టీల వైఖరిపై కార్యాచరణ ప్రకటిస్తామని పర్శ హన్మాండ్లు ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వీరవేణి మల్లేష్ యాదవ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్, నాయకులు కందుకూరి రామాగౌడ్ ,కమలాకర్, కంచర్ల రాజు, చొక్కి కైలాస్, రుద్రవెని సుజిత్, నవీన్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube