5వ తరగతి బాలికపై ప్రిన్సిపాల్ అఘాయిత్యం.. ఉరిశిక్ష వేసిన కోర్టు..

రోజురోజుకూ మానవత్వం మరుగన పడుతుంది.కామంతో కళ్ళు మూసుకుని వరసవా చిన్నా పెద్దా మరిచి మృగాలుగా ప్రవర్తిస్తున్నారు.

 School Principal Sentenced To Death For Raping 11-year-old Girl In 2018, School-TeluguStop.com

చదువు చెప్పాల్సిన గురువులే విద్యార్థులపాలిట శాపంగా మారుతున్నారు.ఈ మధ్య ఇలాంటి ఘటనలు దేశంలో ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి.

ఆడపిల్లలకు ఎక్కడా రక్షణ లేకుండా పోతుంది.

విద్య కోసం అని స్కూల్ కి వెళ్తే అక్కడ కూడా చిన్నారులను లైంగికంగా వేధిస్తున్నారు.

చిన్న పిల్లలు తప్పు చేస్తే సరిదిద్దాల్సింది పోయి గురువులే తప్పటడుగులు వేస్తున్నారు.ఏ పాపం పుణ్యం తెలియని అమాయకులను వాళ్ళ సుఖం కోసం బలి చేస్తున్నారు.11 సంవత్సరాల బాలికను స్కూల్ ప్రిన్సిపాల్ తరగతి గదిలోనే అనేకసార్లు అత్యాచారానికి పాల్పడి ఆ బాలికకు గర్భం రావడానికి కారణం అయ్యాడు.పూర్తి వివరాల్లోకి వెళ్తే.

బీహార్ లోని పాట్నాలో 2018 లో దారుణమైన ఘటన జరిగింది.ఆ ఘటనకు సంబంధించి కోర్టు ఇప్పుడు తీర్పు చెప్పింది.న్యూ సెంట్రల్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ (31) స్కూల్లో 5వ తరగతి చదువుకుంటున్న 11 సంవత్సరాల బాలికపై స్కూలు తరగతి గదిలోనే అత్యాచారానికి పాల్పడ్డాడు.

Telugu Arvind Kumar, Patna, Pregnat-Latest News - Telugu

ప్రిన్సిపాల్ కు అదే పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న ఒక వ్యక్తి సహకరించాడు.ఆ ఉపాధ్యాయుడు బాలికను ఏదో వంక చెప్పి ప్రిన్సిపాల్ దగ్గరకు పంపించేవాడు.గదిలోకి వెళ్లిన ఆ బాలికపై ప్రిన్సిపాల్ అత్యాచారానికి పాల్పడేవాడు.

ఇలా అనేకసార్లు ఆ బాలికపై అఘాయిత్యం చేయడంతో ఆ బాలిక గర్భం దాల్చింది.

తలిదండ్రులు ఆ బాలికకు వాంతులు అవుతున్నాయని ఆసుపత్రికి తీసుకువెళ్లడంలో డాక్టర్ ఆమె గర్భవతి అని చెప్పడంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా షాకయ్యారు.

ఆ బాలికను తల్లి ఏం జరిగిందని అడగగా ఆ బాలిక తల్లికి విషయం మొత్తం చెప్పింది.తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసారు.

ప్రిన్సిపాల్ బండారం బయటపడడంతో విద్యార్థుల తల్లిదండ్రులందరూ ఆ స్కూల్ పై దాడికి దిగారు.పోలీసులు ఆ స్కూల్ ను సీజ్ చేసారు.కోర్టు అనుమతితో ఆ బాలికకు గర్భాన్ని తొలగించారు.పోలీసులు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని ప్రిన్సిపాల్, టీచర్ ను అదుపులోకి తీసుకున్నారు.

పాట్నా కోర్టు ఈ కేసు పై నిందితులకు శిక్ష విధించింది.ప్రిన్సిపాల్ ను దోషిగా నిర్ధారించి ఉరిశిక్ష విధించడంతోపాటు 15 లక్షల రూపాయల జరిమానా వేసింది.

అంతేకాదు ఈ ఘటనకు సహకరించిన ఉపాధ్యాయుడికి జీవిత ఖైదుతో పాటు 50 వేల రూపాయల జరిమానా కూడా విధించింది.ఈ జరిమానా డబ్బులను భాధితురాలైన బాలికకు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube