భారత సంతతి బాలుడు దారుణహత్య .. ఇద్దరు యువకులకు 34 ఏళ్ల జైలు శిక్ష , యూకే కోర్ట్ సంచలన తీర్పు

భారత సంతతి బాలుడిని దారుణంగా హత్య చేసిన ఇద్దరు యువకులకు యూకే కోర్ట్( UK Court ) 34 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.గతేడాది ఇంగ్లాండ్‌లోని వెస్ట్ మిడ్‌లాండ్స్ ప్రాంతంలోని వోల్వర్ హాంఫ్టన్‌లో ఇద్దరు నిందితులు భారత సంతతికి చెందిన బాలుడిని కొడవలి, నింజా కత్తితో పొడిచి చంపారు.2022 జూలై 16న రోనన్ కందా (16)ను( Ronan Kanda ) నిందితులు దారుణంగా హత్య చేశారు.దీనిపై సమాచారం అందుకున్న వెస్ట్ మిడ్‌లాండ్స్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

 2 Teens Sentenced To 34 Years Jail For Murder Of Indian-origin Boy In Uk Details-TeluguStop.com

అయితే పోస్ట్‌మార్టం నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.రోనన్‌పై దుండగులు రెండుసార్లు కత్తితో దాడి చేసినట్లు వైద్యులు నివేదికలో తెలిపారు.ఈ ఘటనపై రోనన్ కుటుంబ సభ్యులు సంతాప ప్రకటన విడుదల చేశారు.అతను తన తోటివారిని నవ్విస్తూ వుంటాడని… కానీ తనను క్రూరంగా చంపారని, ఈ వార్త తెలిసి తమ హృదయం ముక్కలైందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నట్లు వారు సంతాప సందేశంలో పేర్కొన్నారు.

Telugu Teens Sentenced, Jail, Ronan Kanda, Uk Boy Attacked, Uk, Midlands, Wolver

హత్యకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినప్పటికీ అప్పటికి వారు మైనర్లు కావడంతో వారి పేర్లను వెల్లడించలేదు.తాజాగా వోల్వర్‌హాంప్టన్ క్రౌన్ కోర్టులో శిక్ష విధిస్తూ .న్యాయమూర్తి ఆ ఇద్దరిని ప్రభ్‌జిత్ వేదస, సుఖ్‌మాన్ షెర్గిల్‌గా వెల్లడించారు.ఈ నేరానికి గాను ప్రభ్‌జిత్‌కు( Prabjeet Veadhesa ) 18 ఏళ్లు, షెర్గిల్‌కు( Sukhman Shergill ) 16 ఏళ్ల జైలు శిక్షను విధించారు న్యాయమూర్తి.మృతుడు కందా ప్లేస్టేషన్ కంట్రోలర్‌ కోసం దగ్గరలోని తన స్నేహితుడికి ఇంటికి బయల్దేరాడు.

ఈ సమయంలో ప్రభ్‌జిత్ తాను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన ఆయుధాలతో కందాను వెంబడించి వెనుక నుంచి దాడి చేశాడు.ఈ ఘటనలో తీవ్రగాయాలు కావడంతో రోనన్ రోడ్డుపై కుప్పకూలిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

ఈ కేసుకు సంబంధించి ఐదు వారాల విచారణ తర్వాత జ్యూరీ వీరిద్దరికి జైలు శిక్ష విధించింది.

Telugu Teens Sentenced, Jail, Ronan Kanda, Uk Boy Attacked, Uk, Midlands, Wolver

కాగా.సహెద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు భారత సంతతికి చెందిన మాజీ పోలీస్ అధికారికి ఈ ఏడాది జూన్‌లో జైలు శిక్ష విధించింది న్యాయస్థానం.ఇతను 2020లో విధుల్లో వున్న తన తోటి సహోద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది.

ఈ నేరానికి గాను వుడ్ గ్రీన్ క్రౌన్ కోర్ట్ 16 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.అంతేకాదు .దాదాపు 10 ఏళ్ల పాటు సెక్స్ అఫెండర్స్ రిజిస్టర్‌లో వుంటాడని తెలిపింది.నిందితుడిని అర్చిత్ శర్మగా గుర్తించారు.ఇతనిని నార్త్ ఏరియా కమాండ్ యూనిట్‌కు అటాట్ చేశారు.2020 డిసెంబర్ 7న సహోద్యోగిపై శర్మ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube