ఆ యువకుడిది హైదరాబాద్.మాసాబ్ ట్యాంక్ దగ్గర నివాసముంటున్నాడు.
పని ఉంది మాసాబ్ ట్యాంక్ నుండి హిమాయత్నగర్ వైపు బయలుదేరాడు తన బైక్ మీద.అది మిట్ట మధ్యాహ్నం.మార్గ మధ్యలో ఓ యువతి లిఫ్ట్ అడిగింది.మధ్యాహ్నం వేళ బస్సులు కూడా సరిగా రావట్లేదని అమ్మాయికి సాయం చేద్దామని లిప్ట్ ఇచ్చాడు.

హిమాయత్నగర్ బస్సు స్టాప్ కంటే ముందే కొద్ది దూరంలోనే ఆ అమ్మాయిని దించాడు.ఆ యువతి యువకుడికి థ్యాంక్స్ చెబుతుందేమో అని అనుకున్నాడు.కానీ బైక్ దిగగానే అమ్మాయి డబ్బులివ్వమంటూ డిమాండ్ చేసింది.

దీంతో ఆ యువకుడు షాక్ తిన్నాడు.ఏం మాట్లాడుతున్నావ్? నేనెందుకు డబ్బులు ఇవ్వాలి అన్నాడు ఆ యువకుడు.డబ్బులు ఇవ్వకుంటే అరిచి గోల చేస్తా అని చెప్పింది ఆ అమ్మాయి.
బాధితుడిని గమనించిన స్థానికులు అక్కడకు వెళ్లారు.వీళ్లను గుర్తించిన కిలాడి లేడీ అసలుకే మోసం వస్తుందని తెలుసుకొని నెమ్మదిగా జారుకుంది.