టాలీవుడ్ హీరోలు ఈమద్య వ్యాపారాలతో కూడా సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నారు.ఎవరికి తోచిన వ్యాపారం వారు, ఎవరికి ఉన్న అభిరుచి మేరకు వారు వ్యాపారాలు చేస్తూ వస్తున్నారు.
నితిన్ రెస్టారెంట్ బిజినెస్ చేస్తుంటే, మహేష్‌బాబు సినిమా థియేటర్ బిజినెస్‌ను చేస్తున్నాడు.చరణ్ పలు వ్యాపారాలు చేస్తుండగా, బన్నీ కూడా వ్యాపారం చేస్తూ వస్తున్నాడు.

తాజాగా ఈ జాబితాలో అక్కినేని నాగచైతన్య కూడా వ్యాపారం మొదలు పెట్టబోతున్నాడు.ప్రస్తుతం సమంత మరియు నాగచైతన్యలు స్టార్స్‌గా కొనసాగుతూ రెండు చేతుల సంపాదిస్తున్నారు.ఈజంట రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ఎంటర్ అవ్వాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు.
నాగార్జున మొదటి నుండి ఏదో ఒక వ్యాపారంలో కొనసాగుతూ వస్తున్నాడు.
తండ్రి దారిలో చైతూ కూడా వ్యాపారం చేయాలని ఫిక్స్ అయ్యాడు.అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నాడు.
మొదటగా చిన్నగా రియల్ ఎస్టేట్ వెంచర్ ను ప్రారంభించాలని చైతూ భావిస్తున్నాడు.అభివృద్ది వేగంగా జరుగుతున్న వైజాగ్ లో దాదాపు పది కోట్లతో పెట్టుబడి పెట్టి నాగచైతన్య తన రియల్ ఎస్టేట్ వ్యాపారంను మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది.

వ్యాపారాలపై నాగచైతన్యకు పెద్దగా ఆసక్తి లేదని, అయితే సమంత పట్టుబట్టి ఈ వెంచర్‌ను ప్రారంభించేలా ఒప్పించిందని సమాచారం అందుతోంది.అతి త్వరలోనే నాగచైతన్య వైజాగ్ రియల్‌ఎస్టేట్ వెంచర్ ప్రారంభం కాబోతున్నట్లుగా టాలీవుడ్ వర్గాల వారు అంటున్నారు.విశాఖపట్నంకు చెందిన ఒక రియల్టర్ తో కలిసి చైతూ ఈ వెంచర్ ను ప్రారంభిస్తాడని కూడా వార్తలు వస్తున్నాయి.సినిమాల్లో ఆశించిన స్థాయిలో స్టార్‌డం దక్కించుకోలేక పోయిన చైతూ బిజినెస్‌లలో అయినా రాణిస్తాడేమో చూడాలి.