ఎయిర్‌టెల్ కంపెనీ మొబైల్ వినియోగదారులకు భారీ షాకులు ఇస్తోంది.ఒక్కొక్క కస్టమర్‌పై రెవెన్యూ పెంచుకునేందుకు ఇది రీఛార్జ్ ప్లాన్స్ ధరలు విపరీతంగా పెంచేస్తోంది.
కొద్ది నెలల క్రితం 20 శాతానికి పైగా అది రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచిన విషయం తెలిసిందే.ఎయిర్‌టెల్ బాటలోనే జియో, వొడాఫోన్ ఐడియా కూడా నడిచాయి.
దీనితో ఎయిర్‌టెల్ రేట్లు పెంచడానికి రెడీ అవ్వడంతో అన్నీ టెలికాం ఆపరేటర్ల కస్టమర్లకు గుండెలు గుబెల్లుమంటున్నాయి.ప్రస్తుతం ఎయిర్‌టెల్ ఒక్కో యూజర్‌పై 178 రూపాయల లాభం పొందుతోంది.అయితే ఈ లాభాన్ని త్వరలోనే రూ.200కి పెంచాలని ఎయిర్‌టెల్ భావిస్తోంది.ఇందులో భాగంగా టారిఫ్ రేట్లను పెంచేందుకు ప్రణాళికలు రచిస్తోంది.ఈ ఏడాదిలోగా అది రేట్లను పెంచే అవకాశం ఉంది.
భారతీ ఎయిర్‌టెల్ ఇండియా, సౌత్ ఏషియా ఎండీ, సీఈఓ గోపాల్ విట్టల్ మాట్లాడుతూ “ఈ ఏడాది కాలంలో కొంత టారిఫ్‌లను పెంచాలని మేం భావిస్తున్నాం.టారిఫ్‌లు ఇప్పటికీ చాలా తక్కువగా ఉన్నాయని నమ్ముతున్నాం.కనీసం ఒక్కసారైనా టారిఫ్ రేట్లు పెంచి యూజర్ నుంచి యావరేజ్ రెవెన్యూని రూ.200కి తీసుకెళ్లాలని చూస్తున్నాం.” అని తెలిపారు./br>

ఫైనాన్షియల్ ఇయర్ 2022 నాలుగో త్రైమాసికంలో ఎయిర్‌టెల్ రూ.2,007.8 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.759.2 కోట్లు మాత్రమే సంపాదించింది.అయితే ఈసారి రేట్లు పెంచడం వల్ల ఈ రేంజ్ లో కస్టమర్ల నుంచి లాభాలను పొందింది.
అప్పుడు మళ్ళీ పెంపుతో ఎయిర్‌టెల్ ఇంకా లాభాలు పొందాలని ఆశ పడుతోంది.వచ్చే ఐదేళ్లలో యావరేజ్ రెవెన్యూ ని రూ.300కు తీసుకెళ్లాలని కూడా ఇది ప్లాన్ చేస్తోంది.ఏదిఏమైనా టెలికాం ఆపరేటర్లు లాభాల కోసం రేట్లు పెంచుతూ పోతే.
మళ్లీ గతంలోలాగా రీఛార్జ్ ప్లాన్ల మరింత ప్రియం గా మారిపోతాయేమోనని కస్టమర్లు భయపడుతున్నారు.







