తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలన్నదే వైసీపీ విధానమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు మండిపడుతున్నారు.ఈ నేపథ్యంలోనే రెండు రాష్ట్రాలను కలపాలనుకోవడం సరికాదని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు.
అన్ని రాజకీయ పార్టీల ఆమోదంతోనే ఆనాడు రాష్ట్ర విభజన జరిగిందని తెలిపారు.రాజకీయ ఎత్తుగడలో భాగంగానే సజ్జల ఈ వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు.
సజ్జల ఆలోచన అవివేకమని పొన్నం వెల్లడించారు.