విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం కంప్లీట్ అయితే చాలా వరకు ఆర్థికంగా రాష్ట్రం గడిలో పడుతుంది అని చాలామంది ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.ఇదిలా ఉంటే పోలవరం ప్రాజెక్టు పనుల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు త్వరితగతిన కీలకంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే.
ఇలాంటి తరుణంలో టిడిపి పార్టీ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్అసలు పోలవరం ప్రాజెక్టు పనులు ఎప్పుడు పూర్తవుతాయి అన్న దానిపై కేంద్ర ప్రభుత్వాన్ని రాజ్యసభలో ప్రశ్నించారు.
ఈ సందర్భంగా కేంద్ర జల శక్తి సహాయమంత్రి కటారియా రవీంద్ర కుమార్ వేసిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.
వచ్చే ఏడాది ఏప్రిల్ మాసం కల్లా పోలవరం మొత్తం కంప్లీట్ అవుతుందని స్పష్టం చేశారు.మే నాటికి స్పిల్ వే పనులు, క్రస్టు గేట్ల పనులు ఏప్రిల్ నాటికి, కాఫర్ డ్యామ్ నిర్మాణం జూన్ కల్లా పూర్తవుతాయని పేర్కొన్నారు.
వచ్చే ఏడాది నాటికి పోలవరం కుడి ఎడమ కాల్వల నిర్మాణం మొత్తం పూర్తవుతాయని స్పష్టం చేశారు.