తొలి జేమ్స్ బాండ్ సినిమాను చేయడానికి కృష్ణకు అవకాశం ఎలా వచ్చింది

సూపర్ స్టార్ కృష్ణ‌కు అప్పట్లో అరుదైన అవకాశం లభించింది.భారత్ లో ఫస్ట్ జేమ్స్ బాండ్ సినిమా హీరోగా ఎవరికీ దక్కని ఛాన్స్ ను ఆయన దక్కించుకున్నాడు.

 Unknown Facts Of Krishna James Bond Movie Goodhachari 116 , Krishna, James Bond-TeluguStop.com

గూఢాచారి 116 సినిమాతో ఆయన ఈ ఘనత సాధించాడు.ఆ తర్వాత ఆంధ్రా జేమ్స్ బాండ్ గా మారిపోయాడు.

ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో కృష్ణ‌ తేనె మనసులు సినిమా చేశాడు.ఆ సినిమా మూలంగానే గూఢాచారి 116 సినిమాలో నటించే అవకాశం ఆయనకు దక్కిందంటారు ఇండస్ట్రీకి చెందిన పెద్దలు.

తేనె మనసులు సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో స్కూటర్ తో కృష్ణ‌ కారును చేజ్ చేస్తాడు.అలా చేస్తూ.స్కూటర్ ను వదిలేసి కారులోకి జంప్ చేస్తాడు.ఆ సీన్ లో కృష్ణ‌ డూప్ లేకుండా నటించాడు.

ఆ సీన్ నిర్మాత డూండీకి బాగా నచ్చుతుంది.అందుకే మల్లిఖార్జునరావు దర్శకత్వం వచ్చిన గూఢాచారి 116 సినిమా తీయాలని డూండీ అనుకుంటాడు.

ఈ సినిమాలో కృష్ణ‌ హీరో అయితే బాగుటుంది అనుకుంటాడు డూండీ.పానిక్ ఇన్ బ్యాంకాక్ సినిమా స్పూర్తిగా ఆరుద్ర రాసిన కథలో జేమ్స్ బాండ్ పాత్రకు కృష్ణ‌ సరిగ్గా సరిపోతాడు అని భావిస్తాడు.

జేమ్స్ బాండ్ స్టంట్స్ అన్నీ కృష్ణ‌ చేస్తాడని ఆయన బలంగా నమ్మాడు.

Telugu Mallikarjuna, Gudhachari, James Bond, Krishna, Doomdi, Doop-Telugu Stop E

ఒక రోజు డూండీ ఆదుర్తికి ఫోన్ చేస్తాడు.మీ హీరోతో సినిమా చేయాలనుకుంటున్నాను అని చెప్తాడు.అతడిని ఒకసారి మా ఆఫీసుకు పంపించాలని అడుగుతాడు డూండడీ.

తేనె మనుసులు సినిమాలో మెయిన్ హీరోగా చేసిన రామ్మోహన్ ను అడుగుతున్నాడు అనుకుని అతడిని పంపిస్తాడు ఆదుర్తి.రామ్మోహన్ ఆయన ఆఫీసుకు వెళ్లడంతో తాను విషయాన్ని కన్వే చేయడంలో పొరపాటు చేశానని డూండీ భావిస్తాడు.

Telugu Mallikarjuna, Gudhachari, James Bond, Krishna, Doomdi, Doop-Telugu Stop E

మళ్లీ ఆదుర్తికి ఫోన్ చేస్తాడు.డూండీ.రామ్మోహన్ కాదు.కృష్ణ‌ అనే మరో హీరో ఉన్నాడు కదా.తను కావాలని చెప్తాడు.అప్పుడు కృష్ణ‌ను పంపిస్తాడు.

తన ఆఫీసుకు వచ్చిన కృష్ణ‌తో మా సినిమాకు నిన్ను బుక్ చేశాం.జేమ్స్ బాండ్ వేషం వేయాలని చెప్పాడు డూండీ.

అప్పటికప్పుడే అగ్రిమెంట్ మీద సంతకం తీసుకుంటాడు.తన మూడో సినిమాగా గూఢాచారి 369 చేసి మంచి హిట్ అందుకున్నాడు కృష్ణ‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube