తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో బిగ్ బాస్ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతున్న ఈ షోని తెలుగులో నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా, తమిళంలో కమల్ హాసన్, మలయాళంలో మోహన్ లాల్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.
ప్రతి వారం కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వడం, వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా కొత్త కంటెస్టెంట్స్ హౌస్ లోకి రావడం జరుగుతుంటుంది.

బిగ్ బాస్ షోలు బుల్లితెర ప్రేక్షకులకి మస్త్ మజా అందించడమే కాదు, వారికి ఒక్కోసారి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.మలయాళ బిగ్ బాస్ కార్యక్రమంలో ఈ వారం హౌజ్ నుండి హాట్ బ్యూటీ శ్వేతామీనన్ ఎలిమినేట్ అయింది.ఆమె స్థానంలో హిజ్రా కం నటి అంజలి అమీర్ ఇంట్లోకి రావడం అంతా హాట్ టాపిక్ గా మారింది.
మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన పెరంబు చిత్రంలో కథానాయికగా నటించింది అంజలి.ఆ తర్వాత పలు చిత్రాలలో నటించిన ఆమె ఇప్పుడిప్పుడే మంచి పేరు తెచ్చుకుంటుంది.ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో సర్వత్రా ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.

అయితే ఆ మద్య బాలీవుడ్ లో సైతం పలు ట్విస్ట్ లు నెలకొన్నాయి.కాకపోతే కోలీవుడ్, టాలీవుడ్, శాండిల్ వుడ్ మాత్రం కూల్ గా సాగుతుంది.కాకపోతే కోలీవుడ్ బిగ్ బాస్ లో మాత్రం కొన్ని సెన్సేషన్స్ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే మాలీవుడ్ లో హిజ్రా ఎంట్రీ కావడంపై అందరూ ఆశ్చర్యంతో పాటు.వారికి కూడా మంచి ఆదరణ ఇస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు
21 ఏళ్ల అంజలీ అమీర్ రెండేళ్ల క్రితం సర్జరీ చేసుకుని కోయంబత్తూరులో మోడల్ గా రాణించింది.
అయినా సరైన అవకాశాల్లేక ఎంతో మానసిక సంఘర్షణ అనుభవించింది.ముఖ్యంగా జెండర్ సమస్య ఆమెను విపరీతమైన క్షోభకు గురిచేసింది.ఎట్టకేలకు ఒక అవకాశం వచ్చింది.మోడల్ నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టింది.
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పక్కన హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది.మమ్ముట్టి ఎంత పెద్ద నటుడో మనకందరికి తెలుసు.
అలాంటి యాక్టర్ పక్కన ఛాన్స్ అంటే నిజంగా అంజలీ ఆనందానికి అవధుల్లేవు.







