అదిగో స్కామ్ .. ఇదిగో సాక్ష్యం .. ఏపీ యువనేత చుట్టూ కేంద్రం ఉచ్చు ..

ప్రస్తుతం ఏపీలో షాడో ముఖ్యమంత్రిగా అధికారాన్ని చెలాయిస్తున్న ఓ కీలక యువనేత చుట్టూ కేంద్రం ఉచ్చు బిగిస్తోంది.ఆయన చేసిన అవినీతి వ్యవహారాలకు సంబంధించి తగిన ఆధారాలు కేంద్రం సేకరించి తగిన సమయం కోసం ఎదురు చూస్తోంది.

 A Young Politician Will Be Finished From Central Government-TeluguStop.com

ఇప్పటికే కేంద్రం తో ఆ పార్టీ సున్నం పెట్టుకోవడంతో ఆగ్రహంగా ఉన్న ఆ పార్టీ నాయకులు ఎలాగైనా ఇరికించాలనే పట్టుదలతో అన్ని ఆధారాలు సేకరించి సిద్ధంగా ఉంచుకున్నారు.విదేశాల నుంచి డబ్బులను తెచ్చి ఇక్కడ కంపెనీలు ఏర్పాటు విషయంలో ఏపీ యువనేత తీరును కేంద్ర ఆర్థిక శాఖ పరీక్షిస్తోందని తెలుస్తోంది.

హవాలా ద్వారా విదేశాల నుంచి పెట్టుబడుల రూపంలో ఏపీలో కంపెనీలు ఏర్పరిచే స్కామ్ కు ఆ యువనేత పాల్పడినట్టుగా గుర్తించారని సమాచారం.ప్రస్తుతం అధికారం కూడా ఆ యువనేత చేతిలోనే ఉండటంతో ఈ భారీ స్కామ్ కు అడ్డు అదుపు లేకుండా జరుగుతోందని.దీన్ని కేంద్ర ఆర్థిక శాఖ స్కాన్ చేస్తోందని, షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి మనీలాండరింగ్ కు పాల్పడుతున్న ఆయన వ్యవహారం త్వరలోనే బయటపెట్టాలని కేంద్రం చూస్తోంది.

కేంద్రంతో తెగతెంపులు చేసుకుని బయటకి వచ్చేశామన్న కక్షతో కేంద్రం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కొంతకాలంగా ఆ పార్టీ నాయకులు ప్రచారం చేసుకుంటూ సానుభూతి సంపాదించే పనిలోనే ఉన్నారు.

కానీ ఏపీలో అవినీతి వరదలై పారుతోందనే ఆరోపణలు నాలుగేళ్ల నుంచి వస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే సుమారు ఏడువందల కోట్ల రూపాయలను విదేశీ బాట పట్టించి, దాన్ని తిరిగి షెల్ కంపెనీల ద్వారా స్వదేశానికి పెట్టుబడుల రూపంలో రప్పించేశాడని, బినామీలను ఏర్పాటు చేసుకుని అనేక అక్రమాలకు పాల్పడుతున్నాడని కేంద్రం ఆధారాలతో సహా బయటపెట్టేందుకు చూస్తోంది.

అయితే ఇప్పుడు దొరికిన ఆధారాల ప్రకారం లెక్కలోకి వచ్చిన సొమ్ము ఏడు వందల కోట్లు మాత్రమేనని ఇక ఈ వ్యవహారం మీద మరింత లోతుగా అధ్యయనం చేస్తే ఇంకా అనేక స్కామ్ లు బయటపడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.కేంద్రం ఆరా తీసిన వ్యవహారం గురించి సదరు యువనేతకు కూడా తెలియడంతో బెంబేలెత్తిపోతున్నాడని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube