మహబూబ్ నగర్ జిల్లా( Mahabub Nagar ) బయ్యారం మండలంలోని ఎస్బీఐ బ్రాంచ్ లో( SBI ) బుధవారం రాత్రి ఏడవ తరగతి విద్యార్థి( 7th Class Student ) చోరీకి ప్రయత్నించిన ఘటన తీవ్ర కలకలం రేపింది.ఆ విద్యార్థి బ్యాంకులోకి చొరబడిన ఘటన సీసీటీవీ కెమెరాలలో రికార్డు అయింది.
అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.వివరాల్లోకెళితే.
బయ్యారంలో నివాసం ఉంటున్న ఇరుసులాపురానికి చెందిన 13 ఏళ్ల బాలుడు గడ్డపారతో బయ్యారం- పందిపంపుల రహదారి పక్కన ఉన్న ఎస్బీఐ బ్రాంచ్లో రాత్రి 8:20 గంటలకు చొరబడ్డాడు.బ్యాంక్ వెనుకవైపు గ్రిల్స్ తో ఉన్న తలుపు తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించి చోరీకి ప్రయత్నించాడు.
బ్యాంకు లోపలికి వెళ్లిన బాలుడు టేబుల్ డెస్క్ లాలో డబ్బుల కోసం గంటలపాటు వెతికి, తిరిగి బయటకు వెళ్లిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.గురువారం ఉదయం బ్యాంకు వద్దకు వచ్చిన స్వీపర్ పద్మ తాళం పగలగొట్టి ఉండడం చూసి వెంటనే బ్యాంకు అధికారులకు తెలిపింది.
బ్యాంక్ అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అందరూ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.ఈ చోరీయత్నం ఘటన బయటకు రావడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
బ్యాంక్ అంటే ఎంత కట్టుదిట్టమైన భద్రత ఉంటుందో అందరికీ తెలిసిందే.మరి 13 ఏళ్ల బాలుడు ఎవరి సహాయం లేకుండా బ్యాంకులో చోరీకి ప్రయత్నించడం సాధ్యం కాదు.గడ్డపారతో తాళం పగులకోట్టడం చాలా కష్టం, ఒకవేళ పగులకోట్టిన చప్పుడు లేకుండా పగుల కొట్టటం అసాధ్యం.కాబట్టి ఎవరో డైరెక్షన్ ఇచ్చి ఈ బాలుడు చేత దొంగతనం చేయించే ప్రయత్నం చేశారని వ్యక్తం అవుతుంది.
పోలీసులు సీసీటీవీ కెమెరాలను పరిశీలించి, ఇర్సులాపురనికి అందిన బాలుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.బాలుడికి దొంగతనాలు చేసే ఓ పాత నేరస్తుడు కొంతకాలం క్రితం పరిచయం అయినట్లు విచారణలో బయటపడింది.బ్యాంకులో దొంగతనం చేయాలని ఆ బాలుడిని బెదిరించి బ్యాంక్ వెనుక వైపు నుంచి గోడ పైకి ఎక్కించి ఆ బాలుడు బ్యాంకు లోపలికి వెళ్లి, తిరిగి వచ్చేవరకు ఆ పాత నేరస్థుడు అక్కడే ఉన్నట్లు బాలుడు తెలిపాడు.ఆ తరువాత ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లినట్లు బాలుడు పోలీసులకు తెలిపారు.