ప్ర‌స‌వానంత‌రం పొట్ట త‌గ్గ‌డానికి స‌హాయ‌ప‌డే ఉత్త‌మ పానీయాలు ఇవే!

ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి తొమ్మిదో నెల వరకు పొట్ట పెరుగుతూ ఉంటుంది.ప్రసవం అనంతరం కొందరి పొట్ట మళ్లీ తిరిగి మామూలు స్థితికి వస్తుంది.

 These Are The Best Drinks To Help Reduce Belly Fat After Delivery! Best Drinks,-TeluguStop.com

కానీ కొందరు మహిళల్లో మాత్రం పొట్ట తగ్గదు.శరీరం నాజూగ్గా ఉన్న కూడా పొట్ట మాత్రం ఎత్తుగా కనిపిస్తుంటుంది.

దీంతో పొట్టను తగ్గించుకోవడానికి బెల్ట్ ను వాడుతుంటారు.ఈ నేపథ్యంలోనే డెలివరీ తర్వాత పొట్టను తగ్గించుకోవడానికి సహాయపడే ఉత్తమ పానీయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Belly Fat, Drinks, Cinnamon Tea, Delivery, Fat Cutter, Green Tea, Tips, P

దాల్చిన చెక్క లవంగాల టీ.భారీ పొట్టను ఫ్లాట్ గా మార్చడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.ఈ టీ తయారు చేసుకోవడం పెద్ద కష్టం కాదు.ఒక గ్లాస్ వాటర్ లో అంగుళం దాల్చిన చెక్క‌, నాలుగు లవంగాలు వేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

ఉదయాన్నే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో నానబెట్టుకున్న లవంగాలు, దాల్చిన చక్కని వాటర్ తో సహా వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.ఆపై స్టవ్ ఆఫ్ చేసి టీను ఫిల్టర్ చేసుకుని నేరుగా సేవించాలి.

రోజు ఉదయం ఈ టీ ను కనుక తీసుకుంటే ఎలాంటి పొట్ట అయినా దెబ్బకు కరిగిపోతుంది.

Telugu Belly Fat, Drinks, Cinnamon Tea, Delivery, Fat Cutter, Green Tea, Tips, P

అలాగే ప్రసవం అనంతరం మహిళలు నిత్యం ఒక కప్పు గ్రీన్ టీ( Green tea) తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.గ్రీన్ టీ పొట్టను తగ్గించడానికి, అధిక బరువు నుంచి బయటపడడానికి సహాయపడుతుంది.మ‌రియు గ్రీన్ టీ ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలకు( Mental problems ) చెక్ పెడుతుంది.

మైండ్ ను తేలికగా మారుస్తుంది.బహుశా చాలా మంది మహిళలకు తెలియని విషయం ఏంటంటే.

పిల్లలకు తల్లిపాలు ఇవ్వడం ద్వారా కూడా పొట్ట ఎత్తును తగ్గించుకోవచ్చు.అవును మీరు విన్న‌ది నిజమే.

పాలు ఇవ్వడం వల్ల రోజుకు శరీరంలో 500 క్యాలరీలు దాకా ఖర్చవుతాయట.కాబట్టి పొట్ట తగ్గించుకోవడానికి పిల్లలకు పాలు పట్టడం కూడా ఒక మార్గమని చెప్పుకోవచ్చు.

ఇక ప్రసవం అనంతరం పోషకాహారాన్ని తీసుకోవాలి.కంటినిండా నిద్ర ఉండేలా చూసుకోవాలి.

ఒత్తిడికి దూరంగా ఉండాలి.చిన్న చిన్న వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకోవాలి.

ఇలా చేయడం వల్ల మళ్ళీ మీ పొట్ట‌ మామూలు స్థితికి చేరుకుంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube