సాధారణంగా మనం తినే ఫుడ్ మన ఆకలి తీరటానికి, మరి మన స్కిన్ నిగారింపుగా, యవ్వనంగా ఉండటానికి అందించే సూపర్‌ఫుడ్ గురించి మీకు తెలుసా? ఫైబర్, మంచి ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండే ఫుడ్‌ను సూపర్ ఫుడ్ అంటారు.మనకు ఇవన్ని అందించే ఫుడ్ ఏంటో వివరాలు తెలుసుకుందాం.
ఈ సూపర్‌ఫుడ్‌ను తీసుకోవడం వల్ల స్కిన్ క్వాలిటీ పెరుగుతుంది.ఇందులో యాంటీ యాక్సిడెంట్స్, విటమిన్ సీ పుష్కలంగా ఉండే ఫుడ్‌తో చర్మం మృదువుగా మారి హైడ్రేట్ అవ్వడంతోపాటు స్కిన్ అందంగా మారుతుంది.
ప్రముఖ కాస్మిక్ నూట్రోకస్ ప్రైవేట్ లిమిటెడ్ కాస్మోటిక్ ఇంజినీర్ అండ్ ఫౌండర్ డాలీ కుమార్ ఈ సూపర్ ఫుడ్‌పై కొన్ని సలహాలు సూచనలు చేశారు.
గోజీ బెర్రీస్‌ఈ చిన్నచిన్న బెర్రీస్‌తో మన చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
దీంట్లో క్యారట్ కంటే ఎక్కువ శాతం బెటాకెరోటిన్ ఉంటుంది.ఎక్కువ శాతం విటమిన్ సీ ఉంటుంది.
అంతేకాదు దీంట్లో ఉండే అమైనో యాసిడ్స్ మీ చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.దీన్ని వాడే విధానం తెలుసుకుందాం.మాస్క్ వేసుకునే విధానం.3 గోజీ బెర్రీస్‌ను ఓ బౌల్‌లో తీసుకోవాలి.దీనికి రెండు స్పూన్ల వాటర్ యాడ్ చేయాలి.దాన్ని 15 నిమిషాలపాటు నాననివ్వాలి.దీన్ని పేస్ట్‌లాగా చేసి, ఒక స్పూన్ తేనెను జత చేయాలి.ఈ మాస్క్‌ను 15 నిమిషాలు పెట్టుకోవాలి.ఆ తర్వాత నార్మల్ వాటర్‌తో ముఖం కడుక్కుంటే సరిపోతుంది.ఫేస్‌వాష్… మన చర్మాన్ని ఎప్పుడైనా సున్నితంగా ఉంగే ఫేస్‌వాష్‌లను ఉపయోగించాలి.ఎక్కువ శాతం నేచురల్ గోజీ బెర్రీస్‌తోపాటు విటమిన్ సీ ఉండే ఫేస్‌వాష్‌లను వాడాలి.దీంతో చర్మంపై ఉన్న ఓపెన్ పోర్స్‌ను క్లోజ్ చే సే తత్వం ఉంటుంది.కాముకాము
మైర్‌సిరియా దుబియా పండును కాముకాము అని కూడా అంటారు.ఇది మన చర్మాన్ని మృదువుగా తయారు చేస్తుంది.ఇందులో ఎక్కువ శాతం విటమిన్ సీ ఉంటుంది.ఇందులో ఆరెంజ్‌లో ఉండే సీ విటమిన్ కంటే ఇందులో ఎక్కువ శాతం ఉంటుంది.అంతేకాదు దీంట్లో ఉండే బీ3 విటమిన్ పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది.మచ్చలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.
డేడ్ సెల్స్‌ను క్లీన్ చేస్తుంది.యూవీ కిరణాలకు వ్యతిరేకంగా వాడే సన్‌స్క్రీన్ లోషన్‌లో వాడే ప్రతి న్యూట్రియెంట్ కాముకాములో ఉంటుంది.
అంటే ఎస్‌పీఎఫ్ 40 కంటే తక్కువ కాదు ఈ పండు.గ్రీన్ పపాయా
ఇందులో ఉండే కెరోటనాయిడ్స్ ర్యాడికల్ డామేజ్‌ను తొలగిస్తుంది.చర్మాన్ని సాగేలా చేస్తుంది.గ్రీన్ పపాయాలో లైకోపిన్ ఉంటుంది.
ఇది చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా చేస్తుంది.గ్రీన్ పపాయా పీల్ ఆఫ్ మాస్క్ కూడా చాలా బాగా పనిచేస్తుంది.
దీంతో చర్మంపై పేరుకున్న బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్, ఆయిల్‌ను తొలగిస్తుంది.ఈ సూపర్ ఫుడ్ తీసుకుంటే చర్మం రెజువనేట్ అవుతుంది.