కొబ్బరి పాలు, అవిసె గింజలతో ఇలా చేశారంటే హెయిర్ ఫాల్ అన్న మాటే అనరు!

ఆడ మగ అనే తేడా లేదు ప్రస్తుత రోజుల్లో కోట్లాది మంది హెయిర్ ఫాల్( Hair Fall ) సమస్యను ఎదుర్కొంటున్నారు.

అయితే అందరిలోనూ జుట్టు రాలడానికి ఒకే రకమైన కారణాలు ఉండవు.అలాగే అందరిలోనూ ఒకే విధంగా హెయిర్ ఫాల్ ఉండదు.

కొందరిలో జుట్టు రాలడం అనేది తక్కువగా ఉంటే.కొందరిలో చాలా ఎక్కువగా ఉంటుంది.

ఏ విధంగా ఉన్నా కూడా హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టే సత్తా ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ కి ఉంది.

ఈ‌ రెమెడీని ఫాలో అయ్యారంటే హెయిర్ ఫాల్ అన్న మాటే అనరు. """/" / అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax Seeds ) వేసి ఒక కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న అవిసె గింజలను వేసుకోవాలి.

అలాగే ఒక కప్పు ఫ్రెష్ కొబ్బరి పాలు( Coconut Milk ) వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe Vera Gel ), వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్( Coconut Oil ) వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

"""/" / ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట అనంతరం తేలిక పాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

వారానికి ఒక్కసారి ఈ హెయిర్ ప్యాక్ వేసుకుంటే జుట్టు రాలడం క్రమంగా కంట్రోల్ అవుతుంది.

ఊడిన జుట్టు మళ్ళీ మొలుస్తుంది.జుట్టు ఒత్తుగా మారుతుంది.

అలాగే అవిసె గింజలు, కొబ్బరి పాలు పొడి జుట్టును రిపేర్ చేస్తాయి.కురులను సిల్కీగా షైనీ గా మెరిపిస్తాయి.

జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో, ఆరోగ్యకరమైన స్కాల్ప్‌ కు దోహదపడటంలో, మూలాల నుంచి జుట్టును బలోపేతం చేయడంలో కూడా ఈ రెమెడీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.

కల్కి సీక్వెల్ రిలీజయ్యేది అప్పుడేనా.. అన్ని నెలలు ఆగితే కల్కి సీక్వెల్ ను చూడొచ్చా?