ఒకే చోట సందడి చేసిన సాయి ధరమ్ తేజ్ మనోజ్ స్నేహితులు... ఫోటోలు వైరల్!

సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంటుంది.ఇలా హీరోలు అందరూ కలిసి చాలా స్నేహభావంతో మెలుగుతూ ఉంటారు.

 Friends Of Sai Dharam Tej Manoj Made Noise At One Place, Manoj, Sai Dharam Tej,-TeluguStop.com

ఇలా ఇండస్ట్రీలో స్నేహితులకు చాలా క్లోజ్ గా ఉన్నటువంటి వారిలో మంచు మనోజ్( Manchu Manoj ) సాయి ధరమ్ తేజ్ ( Sai Dharam Tej ) నటుడు నరేష్ కుమార్ నవీన్ వంటి వారు ఒకరు.ఈ ముగ్గురు ఎంతో మంచి స్నేహితులు.

ఇక మనోజ్ కు ఇండస్ట్రీలో ఉండే హీరోలు అందరితో కూడా చాలా మంచి స్నేహబంధం ఉంది.ఇకపోతే చాలా రోజుల తర్వాత మనోజ్ సాయి ధరమ్, నవీన్ ఇతర స్నేహితులందరూ కలిసి ఓకే చోట సందడి చేశారు.

ఈ క్రమంలోనే వీరందరూ కలిసి మంచు మనోజ్ ఇంట్లో ఘనంగా పార్టీ చేసుకున్నట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోని ఇందుకు సంబంధించిన ఫోటోలను మనోజ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వచ్చారు.మా ఇంట్లో ఇలా మా ఫ్రెండ్స్, సోదరులమంతా కలిసి సందడి చేశాం.ఇక నవీన్( Naveen ) చేసిన బిర్యానీ అద్భుతంగా ఉంది.బిర్యానీ టైంస్ రంజిత్ చేసిన బట్టర్ చికెన్ ఇంకా అద్భుతంగా ఉందనీ సోషల్ మీడియా వేదికగా వీరు చేసుకున్నటువంటి బిర్యాని గురించి చెప్పుకొచ్చారు.

ఇక విరూపాక్ష( Virupaksha ) సినిమాతో హిట్ కొట్టిన మా సాయి ధరమ్ తేజ్ బాబాయ్‌కి కంగ్రాట్స్ అని మనోజ్ ట్వీట్ వేశాడు.ఇలా మంచు మనోజ్ సాయి ధరమ్ తేజ్ నవీన్ అంతా కలిసి ఒకే చోటే ఇలా పార్టీ చేసుకోవడంతో వీరి మధ్య ఎలాంటి స్నేహభావం ఉందో అర్థమవుతుంది.ఇక ఈ ఫోటోలలో మౌనిక కుమారుడు కూడా ఉన్నారు.

అలాగే నటుడు నరేష్ కుమారుడు నవీన్ బిర్యాని అద్భుతంగా చేస్తాడని ఈ సందర్భంగా మనోజ్ నవీన్ టాలెంట్ బయట పెట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube