తెలంగాణ రాజకీయాలు అధికార, ప్రతిపక్ష పార్టీల విమర్శలు ప్రతి విమర్శలతో హాట్ హాట్ గా మారుతున్నాయి.ఒకప్పుడు తెలంగాణలో ప్రతిపక్షాలు చాలా బలహీనంగా ఉండేవి.
కాని ప్రస్తుతం పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది.టీఆర్ఎస్ ను గద్దె దింపడమే లక్ష్యంగా పనిచేస్తూ ముందుకు సాగుతున్న తరుణం ఇది.
అయితే గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి విజయ ఢంకా మోగించిన తెరాస వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతుందా లేక వేరే పార్టీతో పొత్తు కుదుర్చుకుంటుందా అంటే ఇప్పుడే ఏమీ చెప్పలేని పరిస్థితి ఉంది.అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను ఒకసారి గమనిస్తే టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీ నుండి బలమైన పోటీ ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఎందుకంటే ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీ పట్ల కాస్త వ్యతిరేకత ఉండటం బీజేపీ లాంటి పార్టీలు ఈ వ్యతిరేకత పెరిగేలా వ్యూహ రచన చేయడంతో బీజేపీ అనేది బలపడిన పరిస్థితి ఉంది.అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉంటుందని కొంత ప్రచారం జరుగుతుండగా కాంగ్రెస్ తో పొత్తు ఉంటుందని మరి కొంత ప్రచారం సాగుతున్న పరిస్థితి ఉంది.
అయితే ఈ పొత్తులపై టీఆర్ఎస్ నుండి ఎటువంటి సమాచారం రాకున్నా బయట జరిగే ఊహాగానాలు మాత్రం ఆగటం లేదు.

ఎన్నికల సమయం వరకు రాజకీయ వాతావరణాన్ని టీఆర్ఎస్ కు అనుకూలంగా కేసీఆర్ మలుచుకుంటారని అప్పటి పరిస్థితులను కేసీఆర్ ఇప్పుడే ఊహించి, ఆ పరిస్థితులను బలంగా ఎదుర్కొనేలా ఇప్పటి నుండే వ్యూహ రచన చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.కేసీఆర్ వ్యూహాలు మాత్రం అంత త్వరగా ఎవరికి అర్ధం కానప్పటికీ వాటి ఫలితం మాత్రం టీఆర్ఎస్ కు అనుకూలంగా వచ్చేలా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.