గత కొన్నాళ్లుగా పరిశీలిస్తే, యువత దృష్టి స్మార్ట్ ఫోన్లనుండి స్మార్ట్ వాచీలవైపు మరలింది.దానికి కారణాలు ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు.
అందరికీ తెలిసిందే.ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లలో( smart phones ) ఆరోగ్యకరమైన ఫీచర్లను యాడ్ చేయడంతో వాటికి మంచి క్రేజ్ వచ్చింది.
వీటిలో చాలా వాచీలు నడక, వ్యాయామం ద్వారా శరీరంలో ఖర్చయ్యే కేలరీలు, రక్తపోటు వంటి సమాచారాన్ని యాప్ ద్వారా ఎప్పటికప్పుడు చూపిస్తూ వినియోగదారుల మనసుని చూరగొంటున్నాయి.ఈ క్రమంలోనే దక్షిణ కొరియాకు చెందిన శామ్‌సంగ్ కంపెనీ ( Samsung Company )నిద్రా సమస్యలను గుర్తించే స్మార్ట్ వాచీని ఇటీవల రూపొందించింది.

అవును, మీరు విన్నది నిజమే.దీనికి దక్షిణ కొరియా ఆహార, ఔషధ మంత్రిత్వశాఖ ఆమోదం కూడా లభించడం కొసమెరుపు. ‘శామ్‌సంగ్ గెలాక్సీ వాచ్5’ ( Samsung Galaxy Watch 5 )పేరుతో వచ్చే ఏడాది నుంచి ఇది మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది.ఇది వినియోగదారుని నిద్ర తీరుతెన్నులను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటుంది.
నిద్రలో ఎదురయ్యే గురక, నిద్ర మధ్యలో శ్వాస ఆగిపోవడం వంటి సమస్యలను గుర్తించి, యాప్ ద్వారా తెలియజేస్తుంది.తద్వారా సమస్యలను ముందుగానే గుర్తించడం ద్వారా వెంటనే తగిన చికిత్స పొందడానికి వెసులుబాటు కల్పిస్తుంది.

సూపర్ కదూ.ఇలాంటి వాచీ మాకు కూడా కావాలి అని అనిపిస్తోంది కదూ.అయితే సదరు కంపెనీ వారు దీని ధరను ఇంకా ప్రకటించలేదు.కానీ ఈ సమాచారం తెలిసిన జనాలు మాత్రం ఇది మార్కెట్లోకి ఎప్పుడెప్పుడు వస్తుందాని ఎదురు చూస్తున్నారు.
మరీ ముఖ్యంగా మన ఇండియన్స్ కూడా దీనికోసం ఎదురు చూస్తున్నారు.మనదగ్గర కూడా ఇటీవలి కాలంతో పోలిస్తే ఇపుడు స్మార్ట్ వాచెస్ మార్కెట్ బాగా పెరిగింది.ప్రస్తుతం వీటిని చిన్నపిల్లలనుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ధరిస్తున్నారు.ఇక మధ్య వయస్కులైతే కేవలం ఆరోగ్యం కోసమే వీటిని కొనుగోలు చేస్తున్నట్టు సర్వేలు చెబుతున్నాయి.