పీఎం మోదీ ఆహ్వానంతో.. చెప్పులు కుట్టే వ్యక్తి సెలబ్రిటీగా మారాడు..!

కర్ణాటకకు చెందిన ఒక చెప్పులు కుట్టే వ్యక్తిని( Cobbler ) సర్‌ప్రైజ్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. జనవరి 26న జరగనున్న రిపబ్లిక్ డే పరేడ్( Republic Day Parade ) 2024కి హాజరయ్యే అద్భుతమైన అవకాశాన్ని అతనికి మోదీ అందించారు.

 Karnataka Cobbler Turns Celebrity After Pm Modi Invite To Watch Republic Day Par-TeluguStop.com

ఈ ఆహ్వానంతో ప్రస్తుతం సదరు వ్యక్తి స్థానికంగా సెలబ్రిటీ అయిపోయాడు.వివరాల్లోకి వెళ్తే, కర్ణాటకలోని( Karnataka ) శివమొగ్గ జిల్లాలోని పారిశ్రామిక నగరమైన భద్రావతిలో మణికంఠ( Manikantha ) అనే వ్యక్తి చెప్పులు కుడుతూ జీవనం సాగిస్తున్నాడు.

అతను కుందాపురాలోని శాస్త్రి సర్కిల్‌లో పాదరక్షలు, గొడుగుల రిపేర్ షాప్‌ను రన్ చేస్తున్నాడు.

Telugu Cobbler, Cobblerturns, Karnataka, Manikanta, Pradhanmantri, Primenarendra

ఈ దుకాణాన్ని తన తాత నుంచి తన తండ్రి , తన తండ్రి నుంచి వారసత్వంగా పొందారు.మణికంఠ మాట్లాడుతూ 25 ఏళ్లుగా ఈ వృత్తిలో కొనసాగుతున్నానని, తన కుటుంబ సంప్రదాయానికి ఇది గర్వకారణమన్నారు.వీధి వ్యాపారులకు రుణాలు అందించే ప్రభుత్వ చొరవ అయిన ప్రధాన మంత్రి స్వనిధి పథకం( Pradhan Mantri Swanidhi Scheme ) లబ్ధిదారుల్లో మణికంఠ కూడా ఒకరు.

ఈ పథకం అతనికి ఢిల్లీలోని ఎర్రకోటలో గణతంత్ర దినోత్సవ పరేడ్ 2024ను చూసే అరుదైన అవకాశాన్ని అందించింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఆయనను స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ( PM Narendra Modi ) ఆహ్వానించారు.

Telugu Cobbler, Cobblerturns, Karnataka, Manikanta, Pradhanmantri, Primenarendra

ఈ ఆహ్వానం పట్ల మణికంఠ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.అతను స్థానిక మీడియాతో మాట్లాడుతూ “ఫ్లైట్‌లో ప్రయాణించే ఛాన్స్ రావడం ఇదే తొలిసారి చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాను.పైగా, రిపబ్లిక్ డే ఈవెంట్‌కు నాలాంటి సాధారణ చెప్పులు కుట్టే వ్యక్తిని ఆహ్వానించడం నాకు చాలా సంతోషంగా, ప్రత్యేకంగా అనిపిస్తుంది.” అని చెప్పుకొచ్చాడు.ఇప్పటి వరకు టీవీలో మాత్రమే చూసే కవాతును దగ్గరి నుంచి చూడాలని కూడా తహతహలాడుతున్నారు.టౌన్ మునిసిపాలిటీ అధికారులు తన ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తామని చెప్పినట్లు మణికంఠ వెల్లడించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube