రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో కుటుంబ సభ్యులు ములాఖత్ అయ్యారు.ఈ మేరకు నారా లోకేశ్, బ్రాహ్మణితో పాటు టీడీపీ నేత సత్యనారాయణ రాజు కూడా చంద్రబాబును కలిశారు.
ములాఖత్ లో భాగంగా తాజా రాజకీయ పరిణామాలతో పాటు న్యాయపరమైన అంశాలపై చంద్రబాబుతో చర్చించనున్నారు.అయితే ఇవాళ టీడీపీ -జనసేన తొలి సమన్వయ కమిటీ సమావేశం జరగనున్న నేపథ్యంలో ములాఖత్ ప్రాధాన్యత సంతరించుకుంది.
దాదాపు 40 నిమిషాల పాటు కొనసాగనున్న ములాఖత్ లో భాగంగా వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానితో పాటు అరెస్టుకు నిరసనగా చేయాల్సిన పోరాటంపై చర్చించే అవకాశం ఉంది.







