Tollywood Hero Heroines: తమ సినిమాలలో నటించిన హీరోయిన్లనే ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోలు వీళ్లే?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోలు ఎక్కువగా సినిమాలలో కొనసాగే హీరోయిన్లను పెళ్లి చేసుకోవడానికి ఏమాత్రం ఇష్టపడరు.ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారందరూ కూడా వీలైనంతవరకు ఇండస్ట్రీకి సంబంధం లేనటువంటి అమ్మాయిలను పెళ్లి చేసుకుంటూ ఉంటారు.

 Tollywood Heros Heroines Who Married After Films Nagarjuna Pawan Kalyan Varun T-TeluguStop.com

అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం కొంతమంది హీరోలు స్వయంగా హీరోయిన్లనే ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా తమ సినిమాలలో నటించిన హీరోయిన్లతో ప్రేమలో పడి హీరోయిన్లనే పెళ్లి చేసుకున్నటువంటి టాలీవుడ్ హీరోలు ఎవరు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

సీనియర్ హీరోలలో ఒకరైనటువంటి సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలలో హీరోగా నటించడమే కాకుండా నిర్మాతగా దర్శకుడిగా కూడా గుర్తింపు పొందారు.

ఇక ఈయన నటి విజయనిర్మలతో కలిసి ఎన్నో సినిమాలలో నటించారు.అయితే ఈమెతో కలిసిన నటించే సమయంలోనే కృష్ణ( Krishna ) ఆమెతో ప్రేమలో పడటం జరిగింది.

అయితే అప్పటికే ఇందిరా దేవిని పెళ్లి చేసుకున్నటువంటి కృష్ణ అయిదుగురు పిల్లలకు తండ్రిగా మారారు అయినప్పటికీ పరస్పర అంగీకారంతో ఈయన విజయనిర్మల(Vijaya Nirmala) ను తిరుపతిలో వివాహం చేసుకున్నారు.ఇక విజయనిర్మలకు కూడా ఇది రెండవ పెళ్లి కావడం గమనార్హం.

అక్కినేని నాగార్జున (Nagarjuna) సైతం హీరోయిన్ అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే శివ సినిమాలో అమలతో కలిసి నటించినటువంటి ఈయన అమల(Amala) ను ప్రేమించే అనంతరం పెళ్లి చేసుకున్నారు ఈ దంపతులకు అఖిల్ అనే కుమారుడు ఉన్నారు.అయితే నాగార్జునకు అప్పటికే రామానాయుడు కుమార్తె దగ్గుబాటి లక్ష్మితో వివాహం జరగడం నాగచైతన్య పుట్టిన తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోవడం జరిగింది.

Telugu Amala, Krishna, Mahesh Babu, Nagarjuna, Namratha, Pawan Kalyan, Renu Desa

మహేష్ బాబు(Mahesh Babu) నమ్రత(Namrata) కలిసి వంశీ సినిమాలో నటించారు.ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు ఇలా ప్రేమలో పడినటువంటి ఈ జంట పెళ్లి చేసుకుని ఎంతో సంతోషంగా ఉన్నారు.

Telugu Amala, Krishna, Mahesh Babu, Nagarjuna, Namratha, Pawan Kalyan, Renu Desa

ఊహ(Ooha) శ్రీకాంత్(Sreekanth) వీరిద్దరూ కలిసి మొదటిసారి ఆమె సినిమాలో నటించారు.ఈ సినిమా సమయంలోనే ఊహ ప్రేమలో పడినటువంటి శ్రీకాంత్ కుటుంబ సభ్యులను ఒప్పించి వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.వివాహం తర్వాత ఊహ కూడా సినిమాలకు దూరంగా ఉన్నారు.

Telugu Amala, Krishna, Mahesh Babu, Nagarjuna, Namratha, Pawan Kalyan, Renu Desa

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటి రేణు దేశాయ్(Renu Desai) తో సహజీవనం చేసే అనంతరం పెళ్లి చేసుకున్నారు.ఇక వీరిద్దరూ కలిసి నటించిన బద్రి సినిమా సమయంలోనే ప్రేమలో పడ్డారు.ఈ దంపతులకు అఖీరా ఆధ్య ఇద్దరు పిల్లలు కలరు.

Telugu Amala, Krishna, Mahesh Babu, Nagarjuna, Namratha, Pawan Kalyan, Renu Desa

ఇక వరుణ్ సందేష్(Varun Sandesh) వితిక(Vithika) ఇద్దరు కూడా పడ్డానండి ప్రేమలో మరి అనే సినిమాలో నటించారు అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ కూడా నిజజీవితంలో ప్రేమలో పడటం పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం జరిగింది.

Telugu Amala, Krishna, Mahesh Babu, Nagarjuna, Namratha, Pawan Kalyan, Renu Desa

సినిమా ఇండస్ట్రీలో యాంగ్రీ మెన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు రాజశేఖర్(Rajasekhar) జీవిత(Jeevitha) తో అంకుశం వంటి పలు సినిమాలలో నటించారు.అయితే ఈ సినిమాల సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడటం పెద్దలను ఒపించి పెళ్లి చేసుకోవటం జరిగింది.ఇక ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా వీరిద్దరూ కూడా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా సక్సెస్ అవ్వడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

Telugu Amala, Krishna, Mahesh Babu, Nagarjuna, Namratha, Pawan Kalyan, Renu Desa

నాగ చైతన్య(Nagachaitanya) సమంత(Samantha) కూడా ఏ మాయ చేసావే సినిమాలో కలిసిన నటించారు.ఈ సినిమా సమయంలోనే ప్రేమలో పడినటువంటి ఈ జంట పెద్దలను ఒప్పించి ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ కపుల్ గా ఉన్నటువంటి వీరిద్దరూ కొన్ని మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు.

Telugu Amala, Krishna, Mahesh Babu, Nagarjuna, Namratha, Pawan Kalyan, Renu Desa

వరుణ్ తేజ్(Varun Tej) లావణ్య త్రిపాటి(Lavanya Tripati) కూడా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న సంగతి మనకు తెలిసిందే.వీరిద్దరూ మిస్టర్ సినిమా ద్వారా మొదటిసారి కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు.సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని ఇలా ఇన్ని రోజులు పాటు ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట పెద్దలను ఒప్పించి త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని తెలుస్తుంది.

ఇప్పటికే వీరి పెళ్లి పనులలో భాగంగా ఇటలీ వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube