చరణ్, అల్లు అర్జున్ మల్టీ స్టారర్.. ఇది సాధ్యం అవుతుందా?

టాలీవుడ్ డైరెక్టర్, దర్శకధీరుడు రాజమౌళి వరుస పాన్ ఇండియా చిత్రాలతో తెలుగు సినిమాను ప్రపంచం గర్వించే స్థాయికి తీసుకు వెళ్తున్నారు.ఈ క్రమంలోనే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “బాహుబలి” చిత్రంలో ప్రభాస్ – రానాకి పాన్ ఇండియా స్టార్ హీరోలుగా గుర్తింపు సంపాదించి పెట్టింది.

 Ram Charan,allu Arjun, Tollywood, Rajamouli,latest Tollywood News-TeluguStop.com

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ -రామ్ చరణ్ మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కుతున్న అటువంటి “ఆర్ఆర్ఆర్” చిత్రం ద్వారా మరో పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా తీయాలనే ఆలోచనలో ఉన్నారు.

ఇదిలా ఉండగా రాజమౌళి దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా సినిమా చేయాలని గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఎంతో తాపత్రయ పడుతున్నారు.అయితే ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్లో సినిమా కుదరకపోవడం గమనార్హం.

ఈ క్రమంలోనే అల్లు అరవింద్ సరికొత్త ప్రణాళికతో మరో అడుగు ముందుకేసినట్లు తెలుస్తోంది.

Telugu Allu Aravind, Allu Arjun, Baahubali, Geetha, Prabhas, Raana, Rajamouli, R

ఈసారి రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ -అల్లు అర్జున్ మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కించాలనేది అల్లుఅరవింద్ ప్రణాళిక.వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా చేయడానికి రాజమౌళి ముందుకు వస్తే అందుకు తగ్గ ప్యాకేజీని కూడా అల్లుఅరవింద్ ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం వినబడుతుంది.అయితే అల్లు అరవింద్ ఇచ్చిన ఆఫర్ కి రాజమౌళి ఓకే చెప్తారా లేదా అనేదే ఉత్కంఠగా మారింది.

అల్లు అర్జున్ -రామ్ చరణ్ కాంబో లో రాజమౌళి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ చిత్రం వస్తుందంటే మెగా అభిమానులకి పండగనే చెప్పవచ్చు.మరి రాజమౌళి ఈ విషయం గురించి ఏ విధమైనటువంటి సమాధానం చెప్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube