జుట్టు ఆరోగ్యాన్ని పెంచే మిల్క్ మాస్క్.. వారానికి ఒక్కసారి ట్రై చేయండి చాలు!

పాలు.ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.

 Milk Mask For Healthy And Strong Hair! Milk Mask, Healthy Hair, Strong Hair, Lat-TeluguStop.com

రోజుకు ఒక గ్లాస్ పాలు తాగడం వల్ల మన శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి.అయితే మన శరీరానికే కాదు జుట్టుకు కూడా పాలు అపారమైన ప్రయోజనాల‌ను చేకూరుస్తాయి.

పాలలోని ప్రోటీన్లు మరియు లిపిడ్లు జుట్టును బలోపేతం చేయడానికి స‌హాయ‌ప‌డ‌తాయి.కాల్షియం జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

జుట్టు రాలడాన్ని నివారించడంలో తోడ్ప‌డుతుంది.

అలాగే పాలలో విటమిన్ ఎ, విట‌మిన్ బి6, బయోటిన్, పొటాషియం వంటి ఇతర పోష‌కాలు జుట్టును మృదువుగా మరియు మెరుస్తూ ఉండడానికి పని చేస్తాయి.

మరి ఈ ప్రయోజనాలన్నీ పొందాలంటే పాలను జుట్టుకు ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో బాగా పండిన ఒక అరటి పండును తొక్క తీసి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Telugu Care, Care Tips, Healthy, Latest, Milk, Milk Benefits, Thick-Telugu Healt

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో అర కప్పు పచ్చి పాలు పోసుకోవాలి.అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న‌ బనానా ప్యూరీ, ఒక ఎగ్ వైట్ తో పాటు రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి ఒక్కసారి ఈ మిల్క్ మాస్క్ ను కనుక వేసుకుంటే మీ జుట్టు ఆరోగ్యం అద్భుతంగా మెరుగు పడుతుంది.హెయిర్ ఫాల్, హెయిర్ డ్యామేజ్ వంటి సమస్యలు ఉంటే క్ర‌మంగా దూరం అవుతాయి.

జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెర‌గ‌డం స్టార్ట్ అవుతుంది.కురలు షైనీ గా మెరుస్తాయి.

చుండ్రు సమస్య ఉంటే ప‌రార్‌ అవుతుంది.స్కాల్ప్ హైడ్రేటెడ్ గా సైతం మారుతుంది.

కాబ‌ట్టి హెల్తీ హెయిర్ కోసం త‌ప్ప‌కుండా ఈ మిల్క్ మాస్క్‌ను ట్రై చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube