జుట్టు ఆరోగ్యాన్ని పెంచే మిల్క్ మాస్క్.. వారానికి ఒక్కసారి ట్రై చేయండి చాలు!
TeluguStop.com
పాలు.ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.
రోజుకు ఒక గ్లాస్ పాలు తాగడం వల్ల మన శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి.
అయితే మన శరీరానికే కాదు జుట్టుకు కూడా పాలు అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తాయి.
పాలలోని ప్రోటీన్లు మరియు లిపిడ్లు జుట్టును బలోపేతం చేయడానికి సహాయపడతాయి.కాల్షియం జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
జుట్టు రాలడాన్ని నివారించడంలో తోడ్పడుతుంది.అలాగే పాలలో విటమిన్ ఎ, విటమిన్ బి6, బయోటిన్, పొటాషియం వంటి ఇతర పోషకాలు జుట్టును మృదువుగా మరియు మెరుస్తూ ఉండడానికి పని చేస్తాయి.
మరి ఈ ప్రయోజనాలన్నీ పొందాలంటే పాలను జుట్టుకు ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో బాగా పండిన ఒక అరటి పండును తొక్క తీసి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
"""/" /
ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో అర కప్పు పచ్చి పాలు పోసుకోవాలి.
అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న బనానా ప్యూరీ, ఒక ఎగ్ వైట్ తో పాటు రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ మిల్క్ మాస్క్ ను కనుక వేసుకుంటే మీ జుట్టు ఆరోగ్యం అద్భుతంగా మెరుగు పడుతుంది.
హెయిర్ ఫాల్, హెయిర్ డ్యామేజ్ వంటి సమస్యలు ఉంటే క్రమంగా దూరం అవుతాయి.
జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరగడం స్టార్ట్ అవుతుంది.కురలు షైనీ గా మెరుస్తాయి.
చుండ్రు సమస్య ఉంటే పరార్ అవుతుంది.స్కాల్ప్ హైడ్రేటెడ్ గా సైతం మారుతుంది.
కాబట్టి హెల్తీ హెయిర్ కోసం తప్పకుండా ఈ మిల్క్ మాస్క్‌ను ట్రై చేయండి.
టెల్ అవీవ్ దాడి: బిడ్డను రక్షించేందుకు ఇజ్రాయెల్ మహిళ ప్రాణాలు త్యాగం..