తెలుగులో విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ తదితర పాత్రలలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి టాలీవుడ్ ప్రముఖ నటుడు బ్రహ్మాజీ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే తెలుగులో ప్రముఖ సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన “ముద్దుల మావయ్య” అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకి నటుడిగా పరిచయమై సీనియర్ నుంచి జూనియర్ వరకు అందరి హీరోల చిత్రాలలోనూ నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన వైవాహిక జీవితం విషయానికి సంబంధించిన పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.ఇందులో భాగంగా తాను సినిమా అవకాశాల కోసం చెన్నైలో నివాసం ఉంటున్న సమయంలో తన భార్య ని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని తెలిపాడు.
అయితే అంతకు ముందు తన భార్యకు పెళ్ళయి ఒక బాబు కూడా ఉన్నాడని కానీ ఆమె వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకుందని తెలిపాడు.దాంతో ఇద్దరూ ఒకరిని ఒకరం క్షుణ్ణంగా అర్థం చేసుకున్న తర్వాతే పెళ్లి చేసుకున్నామని చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం ఇద్దరం సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తున్నామని కూడా తెలిపాడు.
అయితే తాను మాత్రం తన భార్య కొడుకుపై ఉన్నటువంటి ప్రేమ తరిగి పోకూడదని ఒక్క కారణంతో తనకంటూ సపరేట్‌గా పిల్లలు కావాలని ఎప్పుడూ అనిపించలేదని తనకు కొడుకు సంజయ్ కుమార్ అంటే అమితమైన ప్రేమని తెలిపారు.
ప్రస్తుతం సినిమాల మీద ఇంట్రెస్ట్‌గా ఉండటంతో తన కుమారుడు కృష్ణవంశీ దగ్గర పని చేస్తున్నాడని చెప్పుకోచ్చాడు.