ప్రధాని మోదీకి వ్యతిరేకంగా హైదరాబాద్ లో ప్లెక్సీలు కలకలం రేపుతున్నాయి.బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఫ్లెక్సీల వార్ ఏ స్థాయిలో జరిగిందో తెలిసిందే.
బీజేపీ, టీఆర్ఎస్ పోటాపోటీగా నగరమంతటా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి.బీజేపీ ఫ్లెక్సీలను టీఆర్ఎస్ శ్రేణులు తొలగించడం.
టీఆర్ఎస్ ఫ్లెక్సీలను బీజేపీ శ్రేణులు తొలగించడం వివాదం రేపింది.బస్ స్టాప్, మెట్రో పిల్లర్స్, హోర్డింగ్.
ఇలా ఎక్కడ చూసినా బీజేపీ, టీఆర్ఎస్ ఫ్లెక్సీలే కనిపించాయి.అయితే మోదీకి వ్యతిరేకంగా ఇంకా భాగ్యనగరంలో ఫ్లెక్సీలు కలకలం రేపుతూనే ఉన్నాయి.
తాజాగా హైదరాబాద్ లోని అంబర్ పేట్ లో ప్రత్యక్షమైన ఓ ఫ్లెక్సీ ఆసక్తికరంగా మారింది.ఓ బస్టాఫ్ లో అకస్మాత్తుగా మోదీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీ ప్రత్యక్షమైంది.
ఇందులో మోదీపై సెటైర్ వేశారు.చాయ్ వాలా అప్డేటెడ్ వెర్షన్ టాక్స్ వాలా అంటూ పంచ్ వేశారు.
ప్రకాశ్ ఆర్ట్స్ పరిధిలో ఉండే బస్టాప్ హోర్డింగ్ లో ఈ ఫ్లెక్సీ పెట్టారు.
బస్టాప్ పై భాగంలో ఈ ఫ్లెక్సీ ఉండగా.
క్రింది భాగంలో సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలకు సంబంధి కల్యాణ్ లక్ష్మి ఫ్లెక్సీ ఉంది.ఇలా బస్టాఫ్ పైన మోదీకి వ్యతిరేకంగా.
క్రింది భాగంలో కేసీఆర్ సంక్షేమ పథకాలకకు సంబంధించి పాజిటివ్ హోర్డింగ్ ఉండటం విశేషం.టీఆర్ఎస్ శ్రేణులే మోదీకి వ్యతిరేకంగా ఇలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని అంటున్నారు.
ఇటీవల పాలు, పెరుగుతో పాటు నిత్యావసర వస్తువలపై జీఎస్టీ విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.అందుకు నిరసనగా ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేసినట్లు అర్థమవుతోంది.
పాలు, పెరుగు, పాల ఉత్పత్తులపై జీఎస్టీ విదింపునకు నిరసనగా ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి.పార్లమెంట్ లో ఎంపీలు నిరసన తెలుపుతున్నారు.