రానా.మూవీ మొఘల్ రామా నాయుడు మనువడు.ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కుమారుడు.భీభత్సమైన సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు.ఇప్పటికే పలు సినిమాలు చేశాడు.నటన పరంగా మంచి ప్రతిభ కనబర్చాడు రానా.
బాహుబలి సినిమా ద్వారా ఏకంగా జాతీయ నటుడిగా మారిపోయాడు.భల్లాల దేవుడి పాత్రలో అదిరిపోయే నట విశ్వరూపాన్ని చూపించాడు.
అటు రానా ఎంచుకునే సబ్జెక్టు కారణంగా మంచి హీరోగా ఎలివేట్ అవుతున్నాడు.బాహుబలి సినిమా తర్వాత వచ్చిన ఘాజీ సినిమాతోనూ మంచి నటనను కనబర్చారు.
ఇక ఆ సినిమా అనంతరం ఆయన వివాహం చేసుకున్నాడు.లేటు వయసులో వ్యాపార కుటుంబానికి చెందిన మిహికా బజాజ్ ను ప్రేమ వివాహం చేసుకున్నాడు.కరోనా కారణంగా వీరి పెళ్లి కేవలం కొద్ద మంది దగ్గరి వ్యక్తుల సమక్షంలోనే జరిగింది.తెలుగు మూలాలున్న బాలీవుడ్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి మిహికా.
ఆమె ఓ ఈమెంట్ డిజైనర్.బిజినెస్ రంగంలో మంచి నైపుణ్యం కలిగి ఉంది.ఈమె దగ్గుబాటి ఇంట్లోకి వచ్చాక.వీరి వ్యాపారాలు కూడా తనే చూసుకుంటుంది.
పెళ్లై రెండు సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో వీరి వైవాహిక జీవితంలో ఓ విషయం ఇద్దరి మధ్య వివాదానికి దారి తీసినట్లు తెలుస్తోంది.ఈ విషయంలో అప్పుడప్పుడు గొడవలు కూడా జరుగుతున్నాయట.కటుంబ సభ్యులు పిల్లల్ని కనాలని కోరుతున్నారట.అయితే మిహికాకు మాత్రం అప్పుడే పిల్లల్ని కనాలని లేదట.మరో రెండు సంవత్సరాల పాటు కెరీర్ ను చక్కగా ఫ్లాన్ చేసుకోవాలి అనుకుంటుందట.అప్పుడే పిల్లల్ని కనాలి అనుకుంటుందట.
ఈ విషయంలో రానా చాలా ఇబ్బంది పడుతున్నాడట.అటు ఫ్యామిలీ మెంబర్స్ కు చెప్పలేక.ఇటు మిహికాకు చెప్పలేక సతమతం అవుతున్నాడట.ప్రస్తుతం ఈ విషయం గురించి ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.వాస్తవాలు ఏంటి అనేది మాత్రం బయటకు తెలియదు.దగ్గుబాటి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరు ఈ విషయం గురించి చెప్తే తప్ప అసలు విషయం ఏంటనేది తెలియదు.