మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో అవినాశ్ రెడ్డితో పాటు తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు.ఈ మేరకు భాస్కర్ రెడ్డి ఇవాళ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
అదేవిధంగా అవినాశ్ రెడ్డి రేపు విచారణకు రావాలని తెలిపారు.అయితే ఇవాళ విచారణకు రాలేనని వైఎస్ భాస్కర్ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు.
దీంతో ఆయనకు మరోసారి సీబీఐ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.